Breaking News

కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నరని, ప్రజలు ఉదయం పదిగంటల నుండి తమ ఫిర్యాదులను అందజేయొచ్చని ఈ ప్రకటనలో కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *