-20 కోట్లతో పలు రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు
-నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తా
-ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ప్రభుత్వము మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు/చట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు.
ఆదివారం చాట్రాయి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి శంకుస్థాపన చేశారు.చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో రూ 25 లక్షలు, చనుబండ గ్రామంలో రూ 50 లక్షలతో సిసి రోడ్లకు పనులుకు మంత్రి శంఖుస్థాపన చేశారు. చాట్రాయి గ్రామంలో రోడ్ల మరమ్మత్తులకు రూ,30 లక్షల పనులు ప్రారంభించారు. అనంతరం చనుబండ గ్రామంలో గుంతలు లేని రోడ్డు నెట్ వర్క్ పనులను మంత్రి పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా ప్రోక్లైనర్ ఎక్కి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం చనుబండ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ చేయమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.820 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారులు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లాలో 76 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులన్నింటినీ సంక్రాంతి లోపు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుందాం జనవరి అనంతరం గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో ఎక్కడైనా గుంతలతో కూడిన రోడ్డు కనబడితే సంబంధిత అధికారులు సస్పెండ్ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే హెచ్చరించడం జరిగిందన్నారు.నూజివీడు నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి అందించిన విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ప్రజల ఆశలు , ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 5 ప్రధాన అంశాలపై చంద్రబాబునాయుడు సంతకాలు చేశారని, వాటిని పూర్తిస్థాయిలో నెరవేరుస్తున్నారన్నారు.రాష్ట్రంలో రూ,1600 వందల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మెగా డీఎస్సీ కి నోటిఫికేషన్ ఇచ్చారని, పేదలకు పెన్షన్ ను 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచడమే కాక 3 నెలల బకాయిలను కూడా జులై, 1వ తేదీనే అందించారన్నారు. ప్రజలపాలిట శాపంగా మారిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను వెంటనే రద్దు చేశామన్నారు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు.ఉచిత గ్యాస్ పంపిణీ దీపావళికి అందించామన్నారు. రాష్ట్రంలోని 61 లక్షల మంది వృద్దులు, దివ్యాంగులకు ఒకటవ తేదీనే పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ర్టంలో ఆర్ధిక విధ్వంసం చేసినప్పటికీ ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు.
కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ జాన్ మోషే,పలువురు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.