Breaking News

ఉండ్రాజవరం మండలం తాడిపర్రు లో విషాద ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి

ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇష్టానుసారంగా , ప్రమాదకర స్థాయిలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చెయ్యవద్దనీ, కొద్దిపాటి నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో కలెక్టరు, ఆర్డీఓ , పోలీసు అధికారులు, ఇతర అధికారులు పర్యటించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి గ్రామస్థులతో ముఖా ముఖి సంభాషించి పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘటన నేపథ్యంలో తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు చొప్పున పరిహారం ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా సోమవారం తెల్లవారుజామున  కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన ఘటన తీవ్ర ద్రిగ్బాంతి కలుగ చేసిందనీ పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కందుల దుర్గేష్ క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

ఫ్లెక్సీ లను ఏర్పాటు చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారీ ఫ్లెక్సీల ఏర్పాటు చేయరాదని , అటువంటి వాటిని తక్షణం తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రజలు కూడా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తాడిపర్రులో జరిగిన విషాద ఘటన ఒక గుణపాఠం గా నిలవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణకు ఫ్లెక్సీలు కడుతుండగా ఐదుగురు యువకులు విద్యుత్ ఘతానికి గురి అయ్యారనీ, వీరిలో బొల్లా వీర్రాజు(26), మారిశెట్టి మణికంఠ (28), పామర్తి నాగేంద్ర (23), కాసగాని కృష్ణ(20) మరణించగా, . కోమటి అనంత రావు (38) అనే వ్యక్తి కి చికిత్స అందజేస్తున్నట్లూ తహసిల్దార్ ప్రసాద్ వివరించారు.

కలెక్టరు వెంట ఆర్డీవో రాణి సుస్మిత, డిఎస్పీ జి . దేవ కుమార్, తహసిల్దార్ పీ ఎన్ డి ప్రసాద్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *