Breaking News

రైతు మేలు కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం

-నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-రైతు పండించిన పంటను కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపిన మంత్రి దుర్గేష్

నిడదవోలు/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రతి అడుగులోనూ కూడా రైతులకు మంచి చేసే దిశగా పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.సోమవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాపవరం గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు మంత్రి దుర్గేష్ కు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని తెలిపారు.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తొలుత కొవ్వూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని, అనంతరం తాను నిడదవోలు నియోజకవర్గం లో పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించానని వివరించారు.. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అభిప్రాయం ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరించిన రెండు మూడు గంటల్లోనే వారి ఖాతాలో నగదు జమ అవుతుందని తెలపడం సంతోషాన్ని ఇచ్చింది అన్నారు.. ఆరుగాలం శ్రమించి, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని అన్నదాత పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుండటం ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం అన్నారు.

కార్తీక మాసంలో కాపవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.. యావత్ రైతాంగానికి ధాన్యం కొనుగోలు కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. తాను ఎన్నికల ప్రచారానికి వచ్చిన తొలి గ్రామం కాపవరమని, ఇక్కడి ప్రజల అభిమానం, ఆప్యాయత వెలకట్టలేనిదని మంత్రి పేర్కొన్నారు.. స్థానిక ప్రజలు గెలుపు పై తనకిచ్చిన ధైర్యం భరోసానిచ్చిందన్నారు.. ఆ ధైర్యమే తాను ఎమ్మెల్యేగా గెలవడానికి కారణమైందని, అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని టీం లో మంత్రిగా అవ్వడానికి ఉపకరించిందని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.

గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతులను నిలువునా ముంచిందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా స్థానికంగా రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రైతుల మేలు కోరేది కూటమి ప్రభుత్వమని మంత్రి అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం పాటిమతో రైతాంగాన్ని అన్ని విధాల కాపాడుతామన్నారు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ,రైతన్నల సమస్యలు పరిష్కరిస్తూ, అవాంతరాలు అధిగమిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.

కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కాపవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *