Breaking News

గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల నందు స్కిల్ హబ్ గా ఎంపిక

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల ( S.V Govt Polytechnic College, Tirupati) నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కౌశల్వికాస్యోజన (PMKVY) 4.0 ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధిఅవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వస్కిల్హబ్స్లలో శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయుటజరిగినది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా, తిరుపతి నియోజకవర్గంలో గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల నందు స్కిల్ హబ్ గా ఎంపిక చేశారు.
ఈ స్కిల్ హబ్ లో

1. అసిస్టెంట్ టెక్నీషియన్ – నెట్‌వర్కింగ్ & స్టోరేజ్
(Assistant technician- Networking & Storage)

కాలవ్యవధి : 210 గంటలు
విద్యార్హత: 10 వ తరగతి/ఆపైన

కోర్స్ కు ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నారు కావున ఈ శిక్షణ పొందుటకై ఆసక్తిగలఅభ్యర్థులను నుండి అప్లికేషన్లను/రిజిస్ట్రేషన్ లను స్వీకరించడం జరుగుతున్నది. ఇందు కొరకై రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 8143576866, 9985129995 ను సంప్రదించండి.

ముఖ్య గమనిక:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలనూ కింద తెలిపిన లింక్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. https://forms.gle/XeQyn5D7DUWHd3sd6

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *