Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 181 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి, పిడి డ్వామా శ్రీనివాస ప్రసాద్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి లు కూడా పాల్గొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు
రెవెన్యూ -119, సివిల్ సప్లై – 4,
పోలీస్ శాఖ-13, పంచాయతీరాజ్ శాఖ – 10, హౌసింగ్- 2, టిడ్కో – 2, సర్వే శాఖ -12, స్కూల్ ఎడ్యుకేషన్ – 4, డ్వామా – 3, సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ -1, సేర్ప్ -2, ట్రైబల్ వెల్ఫేర్ – విద్యుత్ శాఖ- 1, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -2, ఆర్టీసీ -1, ఆర్ డబ్ల్యూ ఎస్ – 2, ఎండోమెంట్స్ -1 రిజిస్ట్రేషన్ శాఖ -1
వెరసి మొత్తం 181 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *