తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(PGRS) ప్రజల ద్వారా అందే ప్రతి అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రీ ఓపెన్ అయిన ప్రతి అర్జీ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన అర్జీల పరిష్కారం మరియు రీ ఓపెన్ ఫిర్యాదుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్నికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సమస్య పరిష్కారం నిమిత్తం వచ్చే ప్రజల అర్జీలను ఎప్పటికప్పుడు తాసిల్దారులు, ఎంపీడీవోలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు ఎండార్స్మెంట్ ఇవ్వాలని, అర్జీలను నిర్ణీత గడువు లోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని తెలిపారు. బియాండ్ ఎస్ ఎల్ ఏ కు వెళ్ళకుండా చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలు తిరిగి రీ ఓపెన్ కాకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు పరిష్కారం కాని సమస్యలకు సంబంధించి పరిష్కారం చేయకపోవడానికి గల కారణాలను అర్జీదారునికి వివరిస్తూ ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డి ఆర్ ఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్లు ఆర్డీవోలు, ఎంపీడీవోలు జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.