తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో వికసిత భారత్ లో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను ఆధునికరించడం జరుగుతుందని, అదేవిధంగా ఆంద్ర ప్రదేశ్ లోని రైల్వే స్టేషన్లు కూడా కొత్త రూపును సంతరించుకో నున్నాయని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, కేంద్ర రైల్వే కమిటీ ఛైర్ పర్సన్ డాక్టర్ సి.ఎం. రమేష్ అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో కలిసి కేంద్ర రైల్వే కమిటీ సభ్యులు నేడు తిరుపతిలో సమావేశమై, తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను పరిశీలించింది. ప్రయాణీకులకు మెరుగైన వసతులతో, అత్యున్నత ప్రమాణాలతో విమానాశ్రయాలకు ధీటుగా రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ లను తీర్చిదిద్దడం జరుగుతుందని, అవసరమైన ప్రదేశాలలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం, ప్రజావసరాలకు అనుగుణంగా తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ సదుపాయం నిర్మించడం జరుగుతుందని ఈ పర్యటనలో పాత్రికేయులకు రమేష్ వివరించారు.
Tags tirupathi
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …