గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను తొలగించాలని, ఆక్రమణలు పునరావృతమైతే సంబందిత వార్డ్ సచివాలయ ప్లానింగ్, శానిటేషన్ కార్యదర్శులదే భాధ్యత అని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ అమరావతి రోడ్ లో ఆక్రమణల తొలగింపు, కంపోస్ట్ యార్డ్ లో వ్యర్ధాల తరలింపు, ఏబిసి సెంటర్ లో వీధి కుక్కల ఆపరేషన్లు, అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత అమరావతి రోడ్ లోని డ్రైన్ మీద, రోడ్ మీద ఆక్రమణల తొలగింపును పరిశీలించి, ఆక్రమణల తొలగింపులో ఎక్కడా రాజీ పడడానికి వీలులేదని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. డ్రైన్ కి ముందు ఏ విధమైన ఆక్రమణ ఉండడానికి వీలు లేదని, ప్రధానంగా డ్రైన్ మీద పూడిక తీయడానికి వీలు లేని ర్యాంప్ లను కూడా తొలగించాలన్నారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో వెంటనే పూడిక తీయడం ప్రారంభించాలన్నారు. తొలగించిన ఆక్రమణల వ్యర్ధాలను ఎప్పటికప్పుడు లో లెవల్ ప్రాంతాలను గుర్తించి మెరక కోసం తరలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారులు స్వచ్చందంగా తమ తొలగించుకోవాలని తెలిపారు. అలాగే డ్రైన్ నిర్మాణం అవసరమైన ప్రాంతాల్లో ప్రతిపాదనలు త్వరగా సిద్దం చేయాలని ఏఈని ఆదేశించారు. అనంతరం ఏటుకూరు రోడ్ లోని వీధి కుక్కల ఏబిసి సెంటర్ ని పరిశీలించి నూతన ఆపరేషన్ దియేటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఆపరేషన్ అనంతరం పోస్ట్ కేర్ కోసం ప్రత్యేక బోనులు తెప్పించాలని ఈఈని ఆదేశించారు. ప్రతి రోజు కనీసం 150 కుక్కలకు ఏబిసి చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, పశువైద్య విభాగం నుండి సీనియర్ డాక్టర్ ని డెప్యుటేషన్ పై తీసుకురావడానికి ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సిఎంఓహెచ్ ని ఆదేశించారు. అనంతరం కంపోస్ట్ యార్డ్ ని పరిశీలించి, ప్రాంగణం శుభ్రంగా ఉంచాలని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు జిందాల్ కి తరలించాలన్నారు. సిబ్బంది హాజరు ఐరీష్ ద్వారా తీసుకోవాలని, యార్డ్ కి ఎమినిటి కార్యదర్శిని ఇంచార్జి గా నియమించాలని ఈఈని ఆదేశించారు. ప్రాంగణంలో సిసి కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, ఏసిపి రెహ్మాన్, డిఈఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …