గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను మరుసటి వారానికి పరిష్కారం చేయాలని, తమ రోజువారీ క్షేత్ర స్థాయి పర్యటనల్లో సదరు ఫిర్యాదులను నేరుగా పరిశీలిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 27 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో వీధి దీపాల సమస్యలు 24 గంటల్లో పరిష్కరించాలన్నారు. డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. ఆర్జీల పరిష్కార పురోగతి పర్యవేక్షణకు కమిషనర్ చాంబర్ లో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు.
అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రతి సోమవారం గత వారం అందిన ఆర్జీల పరిష్కారాలపై సమీక్ష చేస్తామని, కనుక ప్రతి అర్జీ సమగ్రంగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జీలు పునరావృతం కాకుండా, నాణ్యమైన పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిఎంసి కార్యాలయానికి వస్తున్నారని, అవి స్థానికంగానే పరిష్కారం చేయాలన్నారు. ప్రజల నుండి అందే అర్జీలు, ఫిర్యాదుల నమోదుకి ప్రతి విభాగంలో ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు.
సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు 71 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 26, ఇంజినీరింగ్ విభాగం 22, రెవెన్యూ విభాగం 2, ప్రజారోగ్య విభాగం 7, అకౌంట్స్ విభాగంకి సంబందించి 8, ఉపా సెల్ 5, పరిపాలన విభాగానికి సంబందించి 1 ఫిర్యాదులు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, డి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రవి, మేనేజర్ బాలాజీ బాష, డిసిపిలు, ఏసిపిలు, ఈఈలు, ఆర్ఓలు, ఎస్ఎస్ లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి
-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని …