Breaking News

మూల‌పాడు స్టేడియంలో క్రికెట్ అకాడ‌మీ ఏర్పాటు కృషి : ఎసిఎ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్

-మూల‌పాడు క్రికెట్ స్టేడియం సంద‌ర్శ‌న
-త్వ‌ర‌లో గోల్ఫ్ కోర్స్ వ‌చ్చే అవ‌కాశం
-రూర‌ల్ ప్రాంతాల్లో ఎసిఎ త‌రుఫున క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటు

ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో మూల‌పాడులోని క్రికెట్ స్టేడియంలో సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్ లెన్స్ సెంట‌ర్ ను ఏర్పాటు చేయటానికి స‌న్న‌హాలు చేస్తున్న‌ట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. క్రికెట్ అకాడ‌మీ ఏర్పాటుకి సంబంధించి డిజైన్లు త‌యారు చేసి ఏడాదిలోపు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం మూల‌పాడు గ్రామంలోని డాక్ట‌ర్ గోక‌రాజు లైలా గంగ‌రాజు ఎసిఎ క్రికెట్ స్టేడియాన్ని సోమ‌వారం ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎసిఎ కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్ తో క‌లిసి సంద‌ర్శించారు.

వీరికి ఏ సి ఏ అడ్మిన్ మేనేజర్ జి శ్రీనివాసరావు , కేడీసీఏ సెక్రటరీ ఎం రవీంద్ర చౌదరి, కేడీసీఏ జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్ ల‌తో పాటు సాదర స్వాగ‌తం ప‌లికి శాలువాతో ఘ‌నంగా స‌త్క‌రించారు. అనంత‌రం మూలపాడు క్రికెట్ స్టేడియం లోని రెండు మైదానాలు ప‌రిశీలించారు. అలాగే క్రికెట్ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ప‌రిశీలించారు. అలాగే స్టేడియంలోని మౌళిక వసతుల కల్పన, సుందరీకరణ పై అధికారులు, స్టేడియం నిర్వాహకులు, సిబ్బందితో ఎసిఎ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ చ‌ర్చించారు. క్రికెట్ స్టేడియంలో గల అన్ని ఏర్పాట్లను పరిశీలించిన ఎసిఎ అధ్య‌క్షుడు , ఎంపి కేశినేని శివ‌నాథ్ స్విమ్మింగ్ పూల్ , స్టోర్ రూముల మెయిన్ టెన్స్ పై సిబ్బందికి స‌ల‌హాలు సూచ‌న‌లు అంద‌జేశారు.

అనంతరం ఎసిఎ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియా తో మాట్లాడుతూ రాజ‌ధాని ప్రాంతంలో మంగ‌ళ‌గిరితో పాటు, మూల‌పాడు లో కూడా రెండు క్రికెట్ స్టేడియాలు వుండ‌టం ఆనందంగా వుంద‌న‌న్నారు. ఈ రెండు స్టేడియాల‌ను ఏడాదిలోపు అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసువస్తామ‌ని తెలిపారు. మూలపాడు క్రికెట్ మైదానంలో రెండ‌వ గ్రౌండ్ లో పిచ్ మ‌రో నెల‌రోజుల్లో అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు.

అలాగే మూలపాడు క్రికెట్ స్టేడియం కి రావడానికి వున్న‌ మూడు దారులను డెవ‌ల‌ప్ చేసేందుకు నాయకులు,అధికారుల‌కు ఆదేశాలిచ్చిన‌ట్లు తెలిపారు. మూలపాడు క్రికెట్ స్టేడియం కు త్వరలో మంచి రోజులు రానున్నాయని చెప్ప‌టంతో పాటు, మూల‌పాడుగ్రామ‌స్తుల‌కి మ‌రో శుభ‌వార్త చెప్పారు. ఈ గ్రామంలో క్రికెట్ స్టేడియంతో పాటు గోల్ఫ్ కోర్స్ కూడా రాబోతుంద‌న్నారు. ప‌రిస్థితులు అనుకూలించి గోల్ప్ కోర్స్ వ‌స్తే ఇబ్ర‌హీం ప‌ట్నం మండ‌లంలో దాదాపు దాదాపు 400 మందికి ఉద్యోగ అవకాశాలు క‌ల్పించ‌టం జ‌రుగుతుంద‌న్నారు.

ఇక ఏసీఏ గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారుల‌ను వెలికితీయ‌టానికి ప‌నిచేస్తుంద‌న్నారు. ఐపిఎల్, ఎపిఎల్ రావ‌టం వ‌ల్ల క్రికెట్ లో క్రీడాకారుల‌కి చాలా అవ‌కాశాలు వ‌చ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్రికెట్ గ్రౌండ్స్ లేని రూర‌ల్ ప్రాంతాల్లో ఎసిఎ త‌రుఫున గ్రౌండ్స్ ఏర్పాటు చేయ‌టానికి ప్ర‌ణాళిక రెడీ చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఐపిఎల్ తో పాటు, ఇండియ‌న్ క్రికెట్ టీమ్ లోకి ఎసిఎ త‌రుఫున ఎక్కువ మంది క్రికెట‌ర్లు వుండే విధంగా కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్ల‌లో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్ లెన్స్ , క్రికెట్ అకాడ‌మీలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌త ఐదేళ్ల‌లో ఎసిఎ అధ్య‌క్షుడు గా వున్న వాళ్లు ఏ రోజు రాష్ట్రంలో వున్న క్రికెట్ గ్రౌండ్ ప‌రిశీలించేందుకు వెళ్ల‌లేద‌ని..తాము స్వ‌యంగా గ్రౌండ్స్ ప‌రిశీలించి వాటి అభివృద్ధి కోసం ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు.

ఈ కార్యక్ర‌మంలో మూలపాడు పార్టీ అధ్యక్షులు కాకి నాగరాజు, ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షులు రామినేని రాజా, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య , జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి గరికపాటి శివ, మాజీ ఎంపీపీ బలం బాబు, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు మాగంటి న‌ర‌సింహా చౌద‌రి పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *