ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (GPT), విజయవాడ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.05.11.2024 మంగళవారం నాడు విజయవాడ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు(FAC) మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు(FAC) మాట్లాడుతూ అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.  జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉద్యోగం చిన్నదా, పెద్దదా అన్న అపోహను యువత పెట్టుకోవద్దని, ఉద్యోగం చేసుకుంటూ వెళ్తే అదే ఆ వ్యక్తులను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని తెలిపారు. ఈ జాబ్ మేళాలో ముత్తూట్ ఫిన్‌కార్ప్, SBI పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారని వారు తెలిపారు. మొత్తంగా 127 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వారిలో 46 మంది ఎంపిక కాగా మిగిలిన వారిలో 19 మంది Shortlisted అయ్యరు అని తేలిపారు.

Check Also

చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి

-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *