-స్వయం సహాయక బృందం సంఘ సభ్యులకు డేటా వెరిఫికేషన్ పై శిక్షణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక బృందాల్లో ఉన్న ఖచ్చితమైన వివరాల కోసం ఎస్ హెచ్ జి ప్రొఫైల్ ఆప్ ను మెప్మా రూపొందించింది.అందులో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సీతన్న పేటలోని జిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సోమవారం, మంగళవారం మెప్మా సిబ్బందికి రిసోర్స్ పర్సన్ లకు ఎస్ హెచ్ జి ప్రొఫైలింగ్ యాప్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 16 వేల స్వయం సహాయక సంఘాల 1,60,000 మంది సభ్యుల సమాచారం నవీకరణకు మెప్మా చేపట్టింది. దశాబ్ద కాలంగా సంఘాల సభ్యుల డేటా నవీకరణ జరగలేదు. చాలా సంఘాల్లో సభ్యులు మరణించిన వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన, కొంతమంది రెండు మూడు సంఘాల్లో కూడా ఉన్న బ్యాంకు ద్వారా రుణము సక్రమంగా చెల్లించలేక కొన్ని సంఘాలు మధ్యలోనే నిలిచిపోయాయి అలాంటి వాటిని ఇకపై నవీకరించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) SHG ప్రొఫైలింగ్ యాప్ ద్వారా సర్వేకు సన్నాహాలు చేస్తున్నారు. సర్వేలో ప్రతి మహిళ సమగ్ర వ్యవహారాలు సేకరించి వారి ఆర్థిక పరిస్థితులు కుటుంబంలోని పిల్లలు ఆధార్, రేషన్ కార్డులు బ్యాంకు ఖాతా వివరాలు రుణాలు వారి జీవనోపాదుల వివరాలు సేకరించినన్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల మెప్మా పీడీలకు విజయవాడలో రాష్ట్రస్థాయి శిక్షణ మరియు సమావేశం నిర్వహించారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జెడి అమృత్ డాక్టర్ లత యు సి డి పి ఓ ఇన్చార్జి వారి ఆధ్వర్యంలో ఈ నెల నాలుగో తేదీ మరియు ఐదవ తేదీ సర్కిల్ వారీగా ఉన్న ఉద్యోగులు మరియు ఆర్పి లకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ నెల ఆఖరి లోపల నూరు శాతం సంఘ సభ్యులు వివరాలు సేకరించడానికి సర్వే పూర్తి చేయడానికి లక్ష్యాన్ని ప్రణాళికలను తయారు చేసుకున్నారు సంఘ సభ్యుల వివరాలు కోసం పొదుపు సంఘాల్లోని సభ్యులు తాజా సమగ్ర సమాచారం అందుబాటులో లేదు సంఘాల్లో ఎంతమంది కొనసాగుతున్నారు ఎంతమంది తొలగి పోయారో కొత్తగా చేరిన వారిలో బ్యాంకు రుణాలతో ఉపాధి పొందిన వారు ఎంతమంది వారి సొంత ఇల్లు ఉందా లేదా అన్న వివరాలతో సంఘ సభ్యులు సమగ్ర సమాచారం అందుబాటులో లేదు. తాజాగా కూటమి ప్రభుత్వం, SHG సభ్యులు వివరాల కోసం ఎస్ ఎస్ జి ప్రొఫైలింగ్ యప్ ను రూపొందించి. కొత్త వివరాలను నవీకరణంచేందుకు సర్వే జరుపనుంది ఇప్పటివరకు సభ్యులు తొలగింపు కొత్తగా నమోదు ఎడిట్ ఆప్షన్ లేనందున వారితో ఎప్పటికప్పుడు వివరాలను సేకరించేందుకు వీలులేని పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ యాప్ ద్వారా అలాంటి సమస్య తిరిగి పోయింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది టెక్నికల్ ఎక్స్ప్రెస్ డాక్టర్ ఫణికుమార్, శేఖర్, సుజాత, శ్యామల, సిడి వోలు జగదీశ్వరి ఉమామహేశ్వరి మరియు డిఆర్పి రెడ్డి లతా, ఎంఐఎస్ మేనేజర్ లక్ష్మీనారాయణ మరియు సోషల్ వర్కర్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.