మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కమిషనర్ భూ పరిపాలన(సీసీఎల్ఏ) జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లతో అమరావతి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం, ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, వాటర్ టాక్స్ అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీలు వాటి పరిష్కారం గురించి కలెక్టర్ విసీ లో వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయో గుర్తించి, ఆయా సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహించాలని, అదేవిధంగా ఎక్కువగా రీఓపెన్ అయ్యే సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించినప్పుడు, మీసేవ ద్వారా అందించే పౌర సేవలకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేసి అర్జీలు స్వీకరించాలని సిసిఎల్ఏ కలెక్టర్లకు సూచించగా, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఆర్ఓ కు సూచించారు. డిఆర్వో ఇన్చార్జి దేవి వీసీలో పాల్గొన్నారు
Tags machilipatnam
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …