విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మరో అద్భుతమైన వేడుక “సీ – ప్లేన్”, విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా నవంబర్ 9 వ తేదీ, 2024న బబ్బురి గ్రౌండ్స్, పునమిఘాట్ వద్ద చేపడుతున్న సీ – ప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా జరగాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం సీ – ప్లేన్ ప్రారంభోత్సవ వేడుకకు మ్యారీటైం బోర్డ్ సీఈవో ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కె. చైతన్య, ఈవెంట్ ఆర్గనైజర్ తో కలిసి బబ్బురి గ్రౌండ్స్ పునమిఘాట్ వద్ద సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సీ – ప్లేన్ ప్రారంభోత్సవ వేడుకలకు సీటింగ్ అరేంజ్మెంట్స్, ప్రవేశ ప్రణాళిక, త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు మరియు విజయవాడలో ప్రధాన ప్రాంతాలలో ఎల్సిడిల ద్వారా సిప్లేన్ లైవ్ ను ప్రజలు వీక్షించే అవకాశాన్ని కల్పించేలాంటి అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, బబ్బురి గ్రౌండ్స్ లో కార్యక్రమానికి కావాల్సిన వసతులు తదితర అంశాలన్నీ ఎటువంటి లోపం లేకుండా జరగాలని అధికారం ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, జాయింట్ డైరెక్టర్ అమృత్ మరియు పి. వో (యు సి డి) ఇన్చార్జ్ డాక్టర్ లత, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …