Breaking News

అర్హులైన వారందరికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు- మంత్రి నాదెండ్ల మనోహర్

-ఉచిత గ్యాస్ కు అనూహ్య స్పందన..

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సాయంత్రం తెనాలి పట్టణంలోని యడ్లలింగయ్య కాలనీ(రైల్వే గేటు దగ్గర), బాలాజీరావుపేటలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో జరిగిన దీపం-2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల ఇంటి యందు స్వయంగా టీ తయారు చేశారు.

ఏపీలో సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకుంటున్న కూటమి సర్కార్
ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఈడుపురం గ్రామం, ఇచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లాలో దీపం పథకాన్ని ఈ నెల 1వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. దీపం -2 పధకం క్రింద అర్హులైన కుటుంబాలు వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29 వ తేదీ నుంచి 31 మార్చి 2025 వరకూ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేస్తారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

ఈ దీపావళి తో ప్రారంభమయ్య పథకం పాటు ప్రతి ఏడాది
ఏప్రిల్ – జూలై (01),
ఆగష్టు –నవంబర్ (01),
డిసెంబర్ –మార్చి (01)
మధ్య మూడో సిలెండర్ బుక్ చేసుకోవచ్చు.

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు

1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం
2) రైస్ కార్డ్,
3) ఆథార్ కార్డు
4). ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి

ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదుల, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు..

దీపం-2 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 16,82,646 సిలిండర్లు బుకింగ్ చేసుకోగా నేటి 6,46,350 సిలిండర్లు డెలివరీ చేయడం జరిగింది. ఇప్పటివరకు సిలిండర్స్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు రూ.38.07 కోట్ల సబ్సిడీ అందించాల్సి ఉండగా.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.16.97 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో అత్యధికంగా గుంటూరు 99,365 మంది నమోదు చేసుకున్నారు. ఉచిత సిలిండర్ల కోసం నమోదు చేసుకున్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *