Breaking News

అభ్యసన వైకల్యం (డిస్లెక్సియా) ఉన్న పిల్లల పట్ల చిన్నచూపు చూడకూడదు

-‘స్టేట్ వాక్’ ర్యాలీ ప్రారంభించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిర్దిష్ట అభ్యసనా వైకల్యం (డిస్లెక్సియా) అనేది వైకల్యం కాదు ఇది ఒక అభ్యసనా వ్యత్యాసం అని, ఇలాంటి విద్యార్థులు సాధారణ విద్యార్థుల్లానే కనిపించినా పదాలు నేర్చుకోవడంలో, చదవడం, రాయడంలో, గుణింతాలు, సులభ గణితం చేయడంలో వెనకపడుతుంటారని, అలాంటివారిని గుర్తించి తగిన తర్పీదునిస్తే ఆ సమస్యను అధిగమించి, సాధారణ విద్యార్థుల్లానే చక్కని అభ్యసనా ఫలితాలు సాధించవచ్చని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., అన్నారు.
అక్టోబరు మాసం ‘డిస్లెక్సియా అవగాహన నెల’ సందర్భంగా నెల రోజుల పాటు సమగ్ర శిక్షా సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో అక్టోబరు 15న ర్యాలీ, పాఠశాలల్లో డిస్లెక్సియా గురించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది.
ఈ సందర్భంగా విజయవాడలో పటమట కేబీసీ బాయ్స్ హైస్కూల్లో మంగళవారం ముగింపు కార్యక్రమం ‘స్టేట్ వాక్’లో భాగంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
అనంతరం సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., మాట్లాడుతూ.. డిస్లెక్సియా ఉన్నవారిలో ఆల్బర్ట్ ఐన్ స్టీన్, థామస్ ఎడిసన్, లియోనార్డో డావిన్సీ వంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు, స్టీవ్ జాబ్స్, వాల్ట్ డిస్నీ తదితర వ్యాపారవేత్తలు ఉన్నారని గుర్తు చేశారు. నిర్దిష్ట అభ్యసనా వైకల్యం (డిస్లెక్సియా) ఉన్న చిన్నారుల పట్ల చిన్న చూపు చూడకూడకుండా వారి ప్రతిభకు పట్టం కట్టాలని ప్రత్యేక ఉపాధ్యాయులను కోరారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అడిషనల్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.కె.అన్నపూర్ణ, ఏడీ విజయేందర్, ఏఓ వి.శ్రీనివాసరావు, ఐఈ సలహాదారు రామ్ కమల్, ఐఈ కన్సల్టెంట్ వై.నరసింహం, ఛేజింగ్ ప్రతినిధులు చంద్రశేఖర్, మణికంఠ, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *