Breaking News

కేన్సర్ 3.0 సర్వే అవగాహన కార్యక్రమం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది 07-11-2024 వ తేది విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం సుహాసిని ఆదేశానుసారం జిల్లా NCD-CD కార్యక్రమం అధికారి డాక్టర్ మాధవీ నాయుడు ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగినది. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం సుహాసిని, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వి.రావు గారు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కేన్సర్ పై అవగాహన ప్రజల్లో పెంచడం ద్వారా ప్రాధమిక దశలో ఈ వ్యాధిని గుర్తించడం ద్వారా ఈ వ్యాధి చికిత్స సులభతరం అవుతుందని దాని కోసం జిల్లా లో ఈ నెలలో 18 సంవత్సరాలు పైబడిన వారికి సి.హెచ్.ఓ .,ఏ.ఏన్.ఏమ్ .,ఆశా కార్యకర్త తో కూడిన బృందం ప్రతి ఒక్కరిని పరీక్షలు నిర్వహించి కేన్సర్ లక్షణాలు ఉన్నవారికి తగిన పరీక్షలు ద్వారా నిర్ధారించి చికిత్స అందించడానికి చర్యలు చేపడతారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా యం.సుహసిని అన్నారు.
అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వి రావు మాట్లాడుతూ ఈ నెలలో ప్రారంభం కానున్న కేన్సర్ 3.0 సర్వే ద్వారా సమాజంలో ప్రాధమిక దశలో కేన్సర్ గుర్తింపు సాద్యం అవుతుందని తద్వారా సత్వర చికిత్స అందించడం ద్వారా అనేక మంది కేన్సర్ నుండి విముక్తి పొందవచ్చు అని దాని కోసం అంకాలజీ విభాగం ద్వారా మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవగాహన ర్యాలీ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఏలూరు లాకులు వరకూ కోనసాగినది.ఈ కార్యక్రమం లో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థిని కేన్సర్ అవగాహన గేయం పాడి అందరినీ అలరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డి.సి.హెచ్.ఏస్ డా.బి.సి.కె నాయక్., ప్రభుత్వ ఆసుపత్రి సి.ఏస్ ఆర్.ఏం.ఓ లు డా.పద్మావతి,,డా.శోభరాణి,డా.శ్రీనివాసరాజు, ప్రభుత్వ ఆసుపత్రి అంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఆశా పర్వీన్, అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి డి.ఏల్.ఏ.టి.ఓ డా జె.ఉషారాణి,డి.యం.ఓ డా.మెతీబాబు,ఏన్.హెచ్.ఏం డి.పి.యం.ఓ డా.నవీన్., ఏపిడిమియాలజిస్ట్ డా స్నేహ సమీర,డా బాలాజీ,డా.విద్యాసాగర్,డా.కార్తీక్, అదేవిధంగా నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్  పద్మావతి ,  దేవి,  పద్మ,  భారతి, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు,పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు,ఏన్.జి.ఓ సభ్యులు, ఏ.ఏన్.ఏంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. Sd/-డా.యం.సుహసిని., జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి,యన్.టి.ఆర్ జిల్లా, విజయవాడ

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *