రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఖనిజ నిధి ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో గతంలో ప్రతిపాదించి ప్రారంభం కానీ స్థానంలో కొత్తవి ప్రతిపాదించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ నిధి సమావేశంకు కలెక్టరు ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ పనుల పురోగతి పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదిక అంద జేయాలన్నారు. ఇప్పటికే పూర్తి అయిన పనులకు సంబంధించి స్టేజి వారీగా ఫోటోలతో కూడి ప్రగతి పై నివేదికలను కలక్టరేట్ కు సమర్పించాలన్నారు. డిఎమ్ఎఫ్ కింద చేపట్టే పనుల విషయంలో త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, స్కూల్స్ నా వసతి గృహాల పనులకి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కింద 170 పనులలో 63 పనులు పూర్తి అయ్యయని, పంచాయతి రాజ్ లో 173 కి గానూ 77 పూర్తి కాగా, 11 పురోగతిలో, ఇరిగేషన్ కింద 10 పనుల్లో 4 పూర్తి కాగా, 5 పురోగతి లో ఉన్నట్లు తెలిపారు. నియోజక వర్గాలు వారీగా ప్రాధాన్యత పనులను చేపట్టడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నూతనంగా చేపట్టే పనుల విషయంలో కమ్యూనిటీ కి ప్రయోజనం చేకూర్చే విధంగా పనుల ప్రతిపాదించాల్సి ఉందన్నారు. పూర్తి చేసిన పనుల ఫోటోలు ప్రారంభం కు ముందు, పనులు జరుగుతున్న ప్రక్రియ, పూర్తి అయిన పనులు వివిధ దశల్లో ఫోటోలు తో కలసి బిల్లుల అంద చేస్తే పోర్టల్ లో అప్లోడ్ చేసి చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి శ్రీరామచంద్రమూర్తి , జిల్లా మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ. బీవీ గిరి, ఎస్ ఇ ఇరిగేషన్ జీ. శ్రీనివాసరావు, పంచాయతి రాజ్ ఇన్చార్జి ఎస్ ఈ పి. రామకృష్ణా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
విఎంసి సిబ్బందికు సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం …