Breaking News

డి డి ఆర్ సీ కేంద్రం నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి  ఆర్డీవో కృష్ణ నాయక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుద్ధి మద్యం, మానసిక పరిపక్వం లేని పిల్లలకు మాసినక దృఢత్వం కల్పించడంలో దివ్యాంగుల పునరావాస కేంద్రాల బాధ్యత ఎంతో కీలకం అని రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. గురువారం లాలా చెరువు దగ్గర ఉన్న జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాన్ని ఆర్డీవో అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం మరియు సాధికారత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ మద్దతు తో జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేస్తూ, వాటిని నిర్వహించేందుకు ఏజెన్సీ లని గుర్తించడం జరుగుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ అధ్వర్యంలో లాలా చెరువు దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రంలో 8 మంది పిల్లలు సంరక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ఆర్డీవో తనిఖీ సందర్భంలో పిల్లల తల్లితండ్రుల నుంచి వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. తమ పిల్లల్ని ఈ కేంద్రంలో చేరిన తరువాత ఎంతో మార్పు వచ్చిందని, స్పీచింగ్ థెరఫి ద్వారా పదాల కూర్పు చెయ్యగలుగుతున్నట్లు తెలియ చేశారు. ఆర్డీవో వెంట జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, లింగమార్పిడి & సీనియర్ సిటిజన్స్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ యు.రాజు, కేంద్ర నిర్వాహకులు ఎస్. పెద్ది రెడ్డి తదితరులు ఉన్నారు. .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *