Breaking News

అగర్బత్తి యూనిట్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

– వ్యర్థ పూలతో మహిళలు అగవర్తులు తయారు చేయడం స్ఫూర్తిదాయకం
– కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా వారు తీసుకున్న రుణాలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కడియం ప్రాంతంలో వ్యర్థపూల పదార్థాలతో అగర్బత్తుల తయారీ యూనిట్ లో శిక్షణ పొందిన మహిళలతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని స్వయం ఉపాధి కార్యక్రమాలు చెప్పడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దౌహదం చేస్తాయన్నారు. అక్టోబరు 20 వ తేదీన పర్యావరణ పరిరక్షణ, వ్యర్థ పూల నుంచి ఆదాయ వనరుగా తుని లో ఏర్పాటు చేసిన అగరుబత్తులు తయారీ యూనిట్ ను సందర్శించడం జరిగిందని, అంతటితో ఆగకుండా యూనిట్ స్థాపన కోసం ట్రైల్ రన్ నిర్వహించి ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నట్లు స్వయం సహాయక సంఘాల మహిళలని కలెక్టర్ అభినందించారు. మొత్తం 52 మంది శిక్షణ పొందగా, వారిలో తొలి యూనిట్ స్థాపన కోసం 12 మంది ముందుకు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా అగరపుత్రుడు తయారు చేసే ప్రక్రియను కలెక్టర్ కు వివరించారు. కెనరా బ్యాంక్ వారి సహకారంతో తొలుత 12 మందితో తొలి యూనిట్ స్థాపన దిశగా మహిళలు అడుగులు వేయడం జరుగు తోందన్నారు. యూనిట్ సందర్భంగా కలెక్టర్ వెంట డిఆర్డిఏ పిడి ఎన్బిబిఎస్ మూర్తి, జిల్లా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అధికారి కే శ్రీనివాసరావు, స్వయం సహాయక సంఘాల మహిళలు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *