Breaking News

ఉచిత D.S.C కోచింగ్ ఆన్లైన్ పరీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంఘికసంక్షేమశాఖ, సంచాలకులు, తాడేపల్లివారి ఉత్తర్వుల మేరకు తేదీ 10.11.2024న ఉచిత MEGA DSC SC & ST స్క్రీనింగ్ పరీక్షను జరుగును, అర్హులైన అభ్యర్థులు అందరు ఉచిత D.S.C కోచింగ్ ఆన్లైన్ పరీక్ష కు హాజరు కావలసినదిగా కోరడమైనది. అని  కే. శ్రీనివాస్ రావు, జిల్లా ఎస్.సి సంక్షేమ మరియు సాధికారత అధికారి, ఎన్టీఆర్ వారు తెలిపినారు. కావున సంబంధిత అభ్యర్ధులు స్క్రీనింగ్ పరీక్ష నందు పాల్గొనే (749) మంది ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్ధులకు SMS ద్వారా సమాచారమును కూడా పంపుతారు అని తెల్పడమైనది. స్క్రీనింగ్ పరీక్ష ఆన్లైన్ మోడ్ లో మాత్రమే నిర్వహించబడుతుంది. పరీక్షకు హాజరు కానున్న ప్రతి అభ్యర్ధి ఈ క్రింది సూచనలు తప్పక పాటించవలసినదిగా కోరడమైనది.
1. అర్హులైన ప్రతి అబ్యర్ధి కూడా జ్ఞానభూమి పోర్టల్ (https://jnanabhumi.ap.gov.in/) నందు హాల్ట్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొనవలయును.
2. పరీక్షకు ఉ.9.30 గంటలకు పరీక్షా రావలసియున్నది.
3. పరీక్ష హల్లటికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డ్ ను (ఉద: ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్, పాన్ కార్డు)
మరియు 2 పాస్ పోర్ట్ సైజు ఫోటో తీసుకురావలయును.
4. ఉ. 10. 15 ని. తరువాత పరీక్షా కేంద్రం లోనికి ఎవరిని అనుమతించబడదు.
5. జిల్లా నందు గుర్తించబడిన పరీక్ష కేంద్రాలు:
(1) KBN Degree College, Vijayawada.
(2) SRK Engineering College, Enikepadu, Vijayawada.
(3) Vikas Engineering College, Nunna, Vijayawada Rural.
(4) Lakki Reddy Bali Reddy Engineering College, Mylavaram.
హెల్ప్ లైన్ నంబర్స్: ఏదేని సమాచారం కొరకు సాఘిక సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా కార్యాలము నందు హెల్ప్ డెస్క్ ఏర్పటు చేయడమైనది. హెల్ప్ లైన్ నంబర్స్ 79890 27826 & 70756 24856.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *