-ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ నగరపాలక సంస్థ లో సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ది లక్ష్యమని పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) నగరాభివృద్ధి కొరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మరియు శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విజయవాడలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నగర పరిధిలో గల డ్రైనేజ్ సిస్టం, త్రాగునీటి సరఫరా, స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి కావాల్సిన తదితర అంశాలు ఎంపీ కి వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) మాట్లాడుతూ విజయవాడ ఎలాంటి వరద ముంపుకి గురికాకుండా అధికారుల పటిష్ట చర్యలు తీసుకోవాలని, విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంత ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకొని ప్రతిరోజు 24 గంటలు త్రాగునీటి సరఫరా అందుబాటులోకి వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని, విజయవాడలో ఉన్న స్టేడియాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేయమని, కార్పొరేషన్ కి ఆదాయ మార్గాలు పెంచేందుకు కృషి చేయాలని, విఎంసి ఆర్థిక పుష్టికి విజయవాడ నగర అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీ వి జీ ఎస్ వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ సురేష్ బాబు, జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, ప్రభుదాస్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు సత్యనారాయణ, సత్యకుమారి , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర రెడ్డి, సామ్రాజ్యం, సాప్ సభ్యులు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.