Breaking News

ట్రాక్టర్ ద్వారా తగిన ధ్రువ పత్రం తో ఇసుకను తీసుకుని వెళ్లవచ్చు… : కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్బన్ వినియోగదారులకు కోటిలింగాల, ధవళేశ్వరం గాయత్రీ ర్యాంపు ఇసుక లభ్యత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు, ట్రాక్టర్లు ద్వారా నేరుగా ఇసుకను తీసుకొని వెళ్ళ అవకాశం ఉందన్నారు. జిల్లాలో కొత్తగా కొవ్వూరు డివిజన్ పరిధిలో మరో ఎనిమిది డిసిల్టేషన్ పాయింట్స్ లో 7,21,500 మెట్రిక్ టన్నుల ఇసుకను శుక్రవారం నుంచి అందుబాటులో తీసుకొని రావడం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో 16 ఒపెన్ రిచ్ లు ద్వారా 11,13,450 మెట్రిక్ టన్నులు అందుబాటు లో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 22 డిసిల్టేషన్ పాయింట్స్ లో 4,95,000 మెట్రిక్ టన్నులు అందుబాటులొ ఉంచినట్లు, అందులో కొవ్వూరు డివిజన్ పరిధిలో ఆరు రిచ్ లలో 2,52,500 మెట్రిక్ టన్నులు, రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో 16 రీచ్ లలో 2,43,500 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ ప్రాంతంలోని వినియోగదారులకు కోటిలింగాలు, ధవళేశ్వరం గాయత్రి రిచ్ లలో ఇసుకను అందుబాటులో ఉంచామని కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు జిల్లాలో కొత్తగా అందుబాటులోకి తీసుకుని వస్తున్న ఎనిమిది పాయింట్స్ లలో వాడపల్లి రీచ్ లో 60 వేలు ఎమ్ టి లు , ఔరంగాబాద్ రెండు రిచ్ లలో 90 వేలు ఎమ్ టి లు , ఎరినమ్మ రీచ్ లో 37,500 ఎమ్ టిలు ,  కొవ్వూరు లో 15 వేలు ఎమ్ టీ లు, , దండగుంట రేవు లో 45 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులొ ఉందని పేర్కొన్నారు. ట్రాక్టర్లు ద్వారా ఇసుకను నేరుగా తీసుకుని వెళ్ళ వొచ్చునని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం ఇంటి ప్లాన్ తోను, ఇతర ఇంటి మరమ్మత్తు పనులకు సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా ధృవపత్రం పొంది ఇసుకను తీసుకుని వెళ్ళే వోచ్చునని తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *