-పి.వీ రమణ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఎ.పి.పి.టి.డి ఎన్.ఎం.యు.ఎ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వీ రమణ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 128 డిపోల నుంచి డిపో అధ్యక్ష కార్యదర్శులు, గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులు, సి. సి.ఎస్ డెలిగేట్లు, జిల్లా డివిజన్ ఎన్.ఓ.యు జోన్ నాన్ ఆపరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సి.సి.ఎస్ పాలకవర్గ సభ్యులు, ఎ.పి.పి.టి.డి, ఎన్. ఎం.యు.ఎ, ఎ. పి.ఎస్.ఆర్.టి.సి, ఎస్.ఎం.యు. రాష్ట్ర కమిటీ సభ్యులు భారీ స్థాయిలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోఎ.పి.పి.టి.డి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, సంస్థలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లాలని తీర్మానం చేశారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో 21 డిమాండ్లపై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా కృషి చేయాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శాసన మండల సభ్యులు ఈ అశోక్ బాబు, ఏపీఎన్జీవో అధ్యక్షులు కె.వి శివారెడ్డి, ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు వెస్ట్ అధ్యక్షులు విద్యాసాగర్ ఎన్ ఎం యు ఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎ.పి.పి.టి.డి, ఎన్. ఎం.యు.ఎ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి శివారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేస్తే ఓల్డ్ పెన్షన్ విధానం వస్తుందని ఆశించామని ఉన్న ఎస్ ఆర్ బి ఎస్ తీసివేసి 48 వేల ఉద్యోగులు ఎస్ ఆర్ బి ఎస్ కి కాకుండా ఓపిఎస్,జిపిఎస్ కాకుండా ఉన్నామని. అర్హులైన ఉద్యోగులందరికీ పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీలో గతంలో ఉన్న విధంగా పరిమితి లేని వైద్యాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల ఖాళీలను పాత నిబంధనల ప్రకారమే ప్రమోషన్ల ద్వారా ఏపీపీటీడీ అధికారులకు అనుమతించిన విధంగా కిందిస్థాయి అన్నీ కేటగిరీ ఉద్యోగులకు వర్తింపచేయాలని అన్నారు. ఆర్ పి ఎస్ 2017 అరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు.
శాసనమండలి సభ్యులు పి అశోక్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల ఈ హెచ్ ఎస్ కార్డులతో పాటు ఇతర సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పరిష్కార దిశగా తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.