Breaking News

ఘనంగా కిషోరి వికాసం కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ లో గల ఎస్.ఆర్. శంకరన్ హాల్లో కిషోరి వికాసం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

సూర్య కుమారి, IAS, సెక్రటరీ, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు మాట్లాడుతూ కిశోరి వికాసం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న కిషోర బాలలందరికీ, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, బాలల హక్కులు, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, బాలల అక్రమరవాణా, మరియు బాలలపై లైంగిక వేధింపులు మొదలగు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేసారు. వేణుగోపాల్ రెడ్డి, IAS, డైరెక్టర్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు మాట్లాడుతూ కిశోరి వికాసం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మరియు యూనిసెఫ్ (UNICEF) వారి సహకారంతో అమలు చేయడం జరుగుతుందని తెలియజేసారు.

UNICEF ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో బాల్య వివాహాల శాతం భారతదేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాల్య వివాహాల నిర్మూలన కొరకు కిశోరి వికాసం కార్యక్రమాన్ని పునః ప్రారంభించడం అభినందనీయం అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో, ప్రముఖ సైకాలజిస్ట్ మరియు కెరియర్ కౌన్సిలర్ సుధీర్ చంద్ర, ప్రస్తుత సమాజంలో కిషోర బాలలతో ఎలా మాట్లాడడం ద్వారా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావొచ్చో ఉదాహరణలతో తెలియజేశారు. ఎయిమ్స్ మంగళగిరి నుండి సైకియాట్రి విభాగం హెచ్ఓడి డాక్టర్ విజయ చంద్రారెడ్డి; కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్తి గుప్తా; డాక్టర్. నిర్మల గ్లోరీ, స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్, Adolescent Health, అరుణ కుమారి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చిత్తూరు డిసిపిఓ సుబ్రహ్మణ్యం, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్  లక్ష్మీ సామ్రాజ్యం, యూనిసెఫ్ కన్సల్టెంట్స్ ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.

రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి వివిధ ప్రభుత్వ శాఖల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్స్ సుమారు 300 మంది ఈ శిక్షణలో పాల్గొని కిషోర బాలలకు సంబంధించి వివిధ అంశాలపై శిక్షణ శిక్షణ పొందారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *