గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాభివృద్ధిలో యునిడో భాగస్వామ్యం ఎంతో అభినందనీయమని, భవిష్యత్ లో యునిడో సహకారంతో నూతన ప్రాజెక్ట్ ల ప్రణాళికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ యునిడో ప్రతినిధులను కోరారు. శుక్రవారం గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో) సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నందపాల్ సింగ్, నేషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ దీపికా శ్రీపాద్ లతో నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాలుష్యరహిత నగరంగా గుంటూరు నగరాన్ని మార్చుకోవడంలో యునిడో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండ్ (జిఈఎఫ్) ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఇప్పటికే సంగంజాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు, ఈ-ఆటోలకు రూ.10 కోట్ల నిధులు అందించారని తెలిపారు. యునిడో సహకారం వలన రానున్న కాలంలో గుంటూరు నగరం స్వచ్చ నగరంగా, కాలుష్యరహిత నగరంగా అభివృద్ధి చేసుకోవడానికి తగిన ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్ట్ లకు సంబందించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్ సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Tags guntur
Check Also
రూ. 18వేల కోట్లు కాదు… రూ. 20 వేల కోట్ల భారం మీ పాపమే
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సీఎం జగన్ మోహన్ …