మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతిభావంతులైన ఎస్.సి/ ఎస్.టి విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ కొరకు ఈ నెల అనగా ది.10.11.2024 తేదిన జరుగు స్క్రీనింగ్ టెస్ట్ ను “MLC ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్” అమలులో ఉన్నందున ప్రస్తుతానికి వాయిదా వేయుట జరిగినది. తదుపరి జరుగు డీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా తేదిని అభ్యర్థులకు తరువాత తెలియపరచుట జరుగును అని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి అయిన షాహిద్ బాబు షేక్ అధికారి వారు పత్రిక ప్రకటన ద్వారా అభ్యర్థులందరికీ తెలియపరచటమైనది. కావున జిల్లాలో ఉచిత డీఎస్సీ శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకొనిన అభ్యర్థులందరూ పైన తెలిపిన విషయమును గమనించగలరని తెలియపరచడ మైనది.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …