Breaking News

పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనే ప్రభుత్వ ఆశయం అవగాహన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటికొకరు పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనే ప్రభుత్వ ఆశయం అనుసరించి ఈనెల 9వ తేదీన శనివారం ఉదయం10.00 గం.లకు మచిలీపట్నం లోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు నందు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర సారథ్యం లో ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. 18 ఏళ్లు నిండి స్వంతంగా ఏదేని పరిశ్రమ స్థాపించాలి అనే వారికి పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలి, పరిశ్రమ ఎలా స్థాపించాలి దానికి కావలసిన అర్హతలు ఏమి కావాలి, సాంకేతిక పరమైన అంశాలు, పరిశ్రమ స్థాపించడానికి కావలసిన అనుమతులు, పరిశ్రమ స్థాపించి ఎదగాలనే వారికి ప్రభుత్వం తరఫున కల్పించే వివిధ సౌకర్యాలు ,ప్రోత్సాహకాలు, బ్యాంక్ రుణాలు, సబ్సిడీల గురించి పూర్తి వివరాలు వివిధ శాఖల అధికారులతో అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సులో నిరుద్యోగ యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి అవగాహన కల్పించబడుతుంది. కావున ఔత్సాహికులు ఈ సదస్సులో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *