-బుక్కపట్నం చెరువులో బోటింగ్ ప్రారంభించిన మంత్రి
-త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లోనూ బోటింగ్ సౌకర్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్ శాఖామాత్యులు సవితమ్మ
బుక్కపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యసాయి జిల్లాలో టూరిజానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బుక్కపట్నం మండల కేంద్రంలో ఉన్న బుక్కపట్నం చెరువులో బోటింగ్ ను మంత్రి సవిత శుక్రవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సింధూర రెడ్డి, పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ, ఉమ్మడి జిల్లా టూరిజం అధికారి జయ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో కలిసి బుక్కపట్నం చెరువులో మంత్రి సవిత బోటింగ్ చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యాటక రంగానికి కూడా పెద్దపీట వేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా సత్యసాయి జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లాలో లేపాక్షి, ప్రశాంతి నిలయం, తిమ్మమ్మ మర్రిమాను సహా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. రాయలసీమలో అతిపెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది సందర్శకులను ఆకట్టుకునేలా బుక్కపట్నం చెరువులో బోటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సాయి ఆక్వా బోటింగ్ ఆధ్వర్యంలో 14 సీట్ల కలిగిన బోటుతో పాటు 4 ఫెడరల్ బోట్లు, రిస్కీ బోటు ఒకటి నడుపుతున్నట్లు తెలిపారు. త్వరలో బుక్కపట్నం చెరువు వద్ద ఫుడ్ కోర్టు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సెలవు రోజుల్లో, పండగ దినాల్లో కుటుంబంతో బుక్కపట్నం చెరువులో బోటింగ్ చేస్తూ సేద దీరవొచ్చునని మంత్రి సవిత తెలిపారు.
త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లోనూ బోటింగ్ సౌకర్యం
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పెనుకొండ మండలంలో ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్ లనూ బోటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఫుడ్ కోర్టుతో చిల్డ్రన్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. జిల్లాకు పెరుగుతున్న సందర్శకుల తాకిడి దృష్ట్యా ఉంచుకొని లేపాక్షిలో వసతి కోసం రూమ్ ల సంఖ్య పెంచడంతో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామన్నారు. ఈ నెల 23న సత్యసాయి బాబా జయంతిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టపర్తిని అంతర్జాతీయ పర్యటక కేంద్రం గా అభివృద్ధి చేయడానికి టెంపుల్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు అమలు చేయుచున్నారని తెలిపారు కదిరి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, యోగి వేమన మెమోరియల్ తిమ్మమ్మ మర్రిమాను, లేపాక్షి, అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయుచున్నారని తెలిపారు, కేరళలో రాష్ట్రంలో బోటింగ్ సౌఖ్యరం ఎక్కువగా ఉన్నదని, అలాగే ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం లోని బుక్కపట్నం చెరువు వద్ద బోటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రితో కలిసి నేను పాల్గొనడం శుభ పరిణామం అని పేర్కొన్నారు, త్వరలో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అని కొనియాడారు ఇక్కడికి వచ్చే యాత్రికులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించటానికి టూరిజం ఆధ్వర్యంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజినల్ కోఆర్డినేటర్ ఎన్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.