Breaking News

ట్రాక్టర్ ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకొని వెళ్ళవొచ్చి

– ఇసుక సరఫరా విధానం లో సమస్య ఉంటే 18004252540 కి ఫోన్ చెయ్యండి
-రిచ్ ల వద్ద రెండు షిఫ్ట్ లలో బోట్స్ మ్యాన్ బృందాలను నియమించాలి
-విశాఖపట్నం జిల్లా కు ఈ పాయింట్ ద్వారా బల్క్ అందుబాటులో ఉంచాము
-జెసి, ఆర్డీవో తో కలిసి వంగలపూడి రిచ్ తనిఖీ
-కలెక్టరు పి ప్రశాంతి

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇళ్ళ నిర్మాణాలు కోసం, ఇతర ప్రభుత్వ ప్రాధాన్యతా పనుల కోసం అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా బోట్స్ మ్యాన్ సొసైటి లు ప్రతి రీచ్ వద్ద రెండు షిఫ్ట్ లలో పనిచేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.

శనివారం సాయంత్రం సీతానగరం మండలం వంగలపూడి రీచ్ ను జెసి ఆర్డీవో తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, నిర్మాణ పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేయడమే లక్ష్యంగా పెద్ద మొత్తంలో బోట్స్ మ్యాన్ సొసైటి లకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. వంగలపూడి రీచ్ పాయింట్ ద్వారా కనీసం రోజుకు 2000 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో తీసుకురావాలన్నారు. ఇందుకోసం రెండు షిఫ్ట్లలో బోట్స్ మ్యాన్ సొసైటి లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. విశాఖపట్నం జిల్లాకు ఈ రీతిను కేటాయించడం జరిగిందని ఇక్కడ నుండి ఆ జిల్లాకు బల్కే ఆర్డర్ లోను పంపుతున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఎక్కువ మొత్తంలో తెలవకాలని తీసుకువచ్చి అందుబాటులో ఉంచితే ఉపయోగ ఉంటుందన్నారు. దూర ప్రాంతం నుంచి ఇసుక లారీలు వేచి ఉండే సమయం వినియోగదారులపైనే వేసే అవకాశం ఉన్న దృష్ట్యా ఎక్కువ మొత్తంలో చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇసుకను తీసుకువెళ్లే వ్యక్తులు తగిన ఆధారాలు చూపాల్సిన ఉంటుందని పేర్కొన్నారు.

ఇసుక రవాణా , సరఫరా విషయంలో ఏమైనా అభ్యంతరంలో ఉన్న ఎడల అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్న జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004252540 కు ఫోన్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియజేశారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమండ్రి ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ తదితరులు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *