-పి ఎం ఎ వై 1.0 నిర్దేశించిన ఎన్టీఆర్ హౌసింగ్ లక్ష్యాలను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలి
-గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కార్యక్రమాల్లో ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం ఒకటి అని, రానున్న 5ఏళ్లలో అర్హులైన ప్రతి పేద వారికి ఇల్లు కట్టించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అని ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నాణ్యతగా స్టేజి కన్వర్షన్ చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.
శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ అధికారులతో, ఆర్డీవోలు, తాసిల్దారులతో సమీక్ష మంత్రి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో జెసి శుభం బన్సల్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెంకటగిరి ఎమ్మెల్యే కొరగొండ్ల రామకృష్ణ, పూతల పట్టు ఎమ్మెల్యే మురళి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ శ్రీ జీవి ప్రసాద్, ఎస్ఈ నాగభూషణం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, చిత్తూరు ఉమ్మడి జిల్లా ఆర్డీఓ లు, తాశిల్డార్లు, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నందు గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం అని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏమైనా ఆటంకాలు ఉంటే గుర్తించి వాటిని అధిగమించడానికి చర్యలకు సూచిస్తూ గృహ నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారని గుర్తు చేశారు. రానున్న 5ఏళ్లలో అర్హులైన ప్రతి పేద వారికి ఇల్లు కట్టించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అని ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నాణ్యతగా స్టేజి కన్వర్షన్ చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పీఎంఎవై 2 పథకం ప్రారంభం అయ్యే లోపు పీఎంఎవై 1.0 నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. డిసెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అప్పచెప్పే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టనున్నామని తెలిపారు. PMAY1.ఓ పథకంలో భాగంగా ఈ రెండు జిల్లాలకు మంజూరు అయిన గృహాలు సుమారుగా 50 శాతం పూర్తి అయ్యాయని, కొన్ని చోట్ల 70 శాతం మేర పూర్తి అయిందని తెలిపారు. తిరుపతి జిల్లాకి సంబంధించి పి ఎం ఏ వై 1.0 ఎన్టీఆర్ గృహ నిర్మాణ లు పరిశీలిస్తే 77765 గృహాల మంజూరు గాను ఇంక నువ్వు ప్రారంభించని 2470 గృహాలను వెంటనే ప్రారంభించేలా లబ్ధిదారులను మోటివేట్ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే రూఫ్ లెవెల్ లో ఉన్న 6724, గోడల స్థాయిలో ఉన్న 2802, ఇంటి పై కప్పు పడిన 8137 గృహ నిర్మాణాలను పూర్తిస్థాయిలో సాధించాలని ఆదేశించారు. అధికారులు వివరిస్తూ 25,699 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అయ్యాయని తెలిపారు. తిరుపతి జిల్లాలో రానున్న డిసెంబర్ నాటికి చేపట్టాల్సిన నిర్మాణాలలో పురోగతి తక్కువ ఉందని పనితీరు మెరుగు పడాలని సూచించారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి మంజూరైన 77701 ఇళ్లలో ఇంకా ప్రారంభించింది 6199 లబ్ధిదారులను మోటివేట్ చేసి నిర్మాణాలు జరిగేలా చూడాలని ఇంటి పై కప్పు బడిన 5247, గోడల స్థాయిలో ఉన్న 1500, రూఫ్ లెవెల్ లో ఉన్న 4845 గృహాల నిర్మాణాలను, పునాది స్థాయిలో ఉన్న 8943 గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అధికారులు వివరిస్తూ చిత్తూరు జిల్లా పురోగతి రాష్ట్ర స్థాయిలో ప్రథమంలో ఉందని వివరించారు. మంత్రి గడువులోపు ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే వెంకటగిరి మాట్లాడుతూ టిడ్కో ఇళ్ళ అనర్హులు సొంతం చేసుకున్నారని చర్యలు తీసుకోవలని కోరగా వెరిఫై చేయించాలని అధికారులకు సూచించారు. మంత్రి మాట్లాడుతూ ఇళ్ళ మంజూరు కాబడి అనాశక్తితో ప్రారంభించని వారిని మోటివెట్ చేసి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిఎంఎవై 1 నందు ఇళ్ళ మంజూరు చేయబడి నిర్మాణం పూర్తి చేయని వారికి మళ్లీ ఇల్లు మంజూరు కావు అని తెలిపారు. ప్రతి గ్రామంలో సర్వే జరిపి ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్ళ మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూడాలి అన్నారు.కొన్ని చోట్ల ఇసుక కొరత, వర్షం కారణంగా ఆలస్యం కావడంతో సకాలంలో గృహ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరగలేదని తెలిపారు. అదేవిధంగా ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలకు లే ఔట్స్ కు ఇసుకను ప్రాధాన్యత గా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఇసుక అవసరాల కొరకు అందుబాటులోని ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేసుకోమని, తెలిపారు. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే లు వారి నియోజకవర్గంలో గృహ నిర్మాణాలలో కొన్ని సమస్యలను, అవకతవకలు ఉన్నాయని తెలియపరిచారని, వాటిని కూడా త్వరలో అన్నిటికి పరిష్కారం చూపుతామన్నారు.
పూతల పట్టు ఎమ్మెల్యే పలు అంశాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కుప్పంలో ఇల్లు నిర్మాణం జరిగాయి కానీ, దానికి కావలసిన విద్యుత్ సౌకర్యమును రెస్కో, ఏపీఎస్పీడిసిఎల్ వారు సమన్వయంతో ఏర్పాటు చేయవలసి ఉందని అన్నారు. అక్కడ నిర్మాణం జరిగిన ఇళ్ళకు విద్యుత్ కొరత లేకుండా కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కేంద్ర నిధులు జలజీవన్ మిషన్, అమృత్, నరేగా నిధుల నుండి కాలనీ లలో మౌలిక సదుపాయాలు నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా హౌసింగ్ పై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారని ముఖ్యంగా ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా క్వాలిటీ పరంగా రాజీ లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ల సమావేశంలో ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పేద ప్రజలకు ఈ ప్రభుత్వం మంచి నాణ్యమైన ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. అదేవిధంగా వినియోగదారుడు ఇళ్ల నిర్మాణం చేపట్టి హౌసింగ్ వారికి బిల్లులు సమర్పించిన వారం లోపల వాటి ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. మార్చి 2025 నుండి PMAY 2.0 కార్యక్రమం ప్రారంభం కానుందని తద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి ఇళ్లను మంజూరు చేసి ప్రతి పేద వారికి ఇళ్లను అందిస్తామని తెలిపారు. టిడ్కో గృహాల బాధితులను ఆదుకుంటాం. గతంలో 2014-19 కాలంలో నిర్మించిన టిడ్కో ఇల్లు 90 శాతం పూర్తయిన వాటిని కూడా గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసి లబ్ధిదారులను ఇబ్బందికి గురి చేశారని తద్వారా లబ్ధిదారులను నష్టపోయారని తెలిపారు. బాధ్యతగా గృహాల నిర్మాణాలకు లక్ష్యం నిర్దేశించుకుని పూర్తి చేసేలా, లబ్ధిదారులను మోటివెట్ చేసి, సంబంధిత శాసన సభ్యులు, ప్రజా ప్రతినిదులు సహకారంతో స్టేజి కన్వర్షన్ జరిగేలా చర్యలు చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపుకు నిధుల కొరత లేదని తెలుపుతూ, లబ్ధిదారులకు బిల్లులు నిధులు ఉన్నా చెల్లించకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.