-మెప్మా, సెర్ప్ ఉద్యోగుల మాదిరి, అన్ని శాఖల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్.ఆర్ పాలసీ అమలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి…
-బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, విధినిర్వహణలో ప్రమాధానికి గురైన సందర్భంలో సదరు డ్రైవర్లకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, సుప్రింకోర్టు ఉత్తర్వులు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, మెప్మా, సెర్ప్ ఉద్యోగుల మాదిరి అన్ని శాఖల్లో పనిచేసే డ్రైవర్లు మరియు ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా హెచ్.ఆర్ పాలసీ అమలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలనీ సంసాని శ్రీనివాస రావు అధ్యక్షలు, ఏ.పి. ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల కేంద్ర సంఘం అద్యక్షతన విజయవాడ రెవెన్యూ భవన్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యతిదిగా పాల్గొన్న ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు అతి తక్కువ వేతనాల పొందుతూ ఎక్కువ సమయం పనిచేసే కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లుకు, అందరూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లుకు అన్నివిదాలుగా ఉద్యోగ భద్రత, హెచ్ ఆర్ పాలసీ అమలు, సీనియారిటీ ప్రాతిపదికన ఇంక్రీమెంట్లు తదితర ఇతర సమస్యలు పరిస్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లకు ఏపిజేఏసి అమరావతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని….. హామిచ్చారు. సంసాని ప్రభుత్వ డ్రైవర్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ డ్రైవర్లు సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు దశాబ్దాలగా ప్రభుత్వ వాహనాలు కొనుగోలు లేదని, ఉన్న వాహనాలకు మరమ్మత్తు కూడా నిధులు విడుదలచేయడం లేదని కొంత మంది అధికార్లు అద్దెవాహనలను ఉపయోగిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నారని మండిపడ్డారు అద్దెవాహనల విధానం రద్దుచేస్తూ తక్షణమే ప్రభుత్వం నూతన వాహనాలను కొనుగోలు చేయాలని అర్హులైన కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ డ్రైవర్ల సర్వీసులను పరిగణనలోకి తీసుకుని వారికి వారికి ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఇంకా ఈ సమావేశంలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె. సుమన్ ప్రధాన కార్యదర్శి ఎ. సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ కి ఇఎస్ఐ హెల్త కార్డులు మంజూరుచేయాలని ప్రభుత్వ డ్రైవర్లతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఏ.పి. ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. చిరంజీవి రాష్ట్ర ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ డ్రైవర్ల వెల్పేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు పామర్తి నాగరాజు డొప్పా రమణ రాష్ట్ర నలుమూల నుండి వందలాది మంది డ్రైవర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లుకు సంబందించి పలు తీర్మానాలు ఆమోదించారు.
ఆక్సిడెంట్ పాలసీలు పంపిణీ
ఈ సమావేశంలో రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ & కాంట్రాక్ట్ డ్రైవర్లు సంక్షేమ సంఘం పక్షాన వివిధ శాఖల్లో పనిచేసే షుమారు 50 మంది డ్రైవర్లకు పది లక్షల (10,00,000/-) రూపాయల పోస్టల్ ఆక్సిడెంటల్ పాలసీ బాండ్ పేపర్లను బొప్పరాజు, సoసాని శ్రీనివాసరావు, కే.సుమన్ గార్ల చేతులు మీదుగా వారందరికీ పంపిణీ చేయడం జరిగింది.