విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి మెంబర్ షిప్ తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా ఈరోజు మారింది. ధి:-10-11-2024 ఈరోజు ఆదివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గం లోని 58వ డివిజన్ వడ్డెర కాలని నందు మరియు ఇందిరా నాయక్ నగర్”HP” పెట్రోల్ బంక్ సమీపము నందు తెలుగుదేశం పార్టీ 2024-2026 సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా :- తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ:-టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024కు విశేష స్పందన లభిస్తోంది, 2 వారాల్లో 20 లక్షల మందికి పైగా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు అని…సభ్యత్వం పునరుద్ధరించుకున్న సభ్యులకు, కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారికి రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్తకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా,కుటుంబ సభ్యులకు విద్య, ఉద్యోగ, వైద్య,సహాయం అందుతుంది, మరియు ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తకు మట్టి ఖర్చులు నిమిత్తం తక్షణ సహాయం ₹10వేల రూపాయలు అందించడం జరుగుతుంది అని … ప్రజలు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం ఉన్న వారి సభ్యత్వాలను రెన్యూవల్ చేసుకోవడం,సభ్యత్వం లేనివారు కొత్త సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ పిరియ సోమేశ్వరరావు,దాసరి కనకరావు, ఎరుబోతు రామారావు, సర్వేపల్లి అమర్నాథ్ , వేముల దుర్గారావు,మల్లు రవి, తదితరులు పాల్గొన్నారు.