Breaking News

ప్రి రిపబ్లిక్ డే పెరేడ్ కు ఎంపికైన ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 12 నుండి 21 వరకు జరిగే ప్రి రిపబ్లిక్ డే పెరేడ్ కు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మరియు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కొల్లేటి రమేష్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఎస్ కంటేజెంట్ లీడర్ గా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఉత్తర్వులు పంపారు. ఈ సంవత్సరం జరిగే ప్రి రిపబ్లిక్ డే పెరేడ్, మహారాష్ట్రలోని జెల్గాన్ లో ఉన్న నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీలో ఈనెల 12 నుండి 21 వరకు జరిగే ప్రి రిపబ్లిక్ డే పెరేడ్ కు రాష్ట్రం నుంచి ఎన్ఎస్ఎస్ మేల్ కంటింజెంట్ లీడర్ గా డాక్టర్ కొల్లేటి రమేష్ నియమితులయ్యారు. రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాలు మరియు వాటి అనుబంధ కళాశాల నుంచి 44 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారిలో 22 మంది బాయ్స్ 22 మంది గర్ల్స్ ఈ శిబిరానికి ఎంపికయ్యారన్నారు. ఈనెల 11న వీరందరినీ మహారాష్ట్ర వెళ్లనున్నారని తెలిపారు. ఈ క్యాంపులో ఎన్ఎస్ఎస్ శిక్షణా తరగతులు పొంది నవంబర్ 22 న తిరిగి వస్తారని, అక్కడ ఎంపికైన వారిని జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకలలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు, జిల్లా ఆఫీసర్లు మరియు పట్టణ ప్రముఖులు డాక్టర్ కొల్లేటి రమేష్ ని అభినందించారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *