Breaking News

ఐ ఎ ఎస్ శిక్షణలో క్షేత్ర స్థాయిలో అవగాహనా అత్యంత కీలకం  కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అల్ ఇండియా సర్వీసెస్ కు ఎంపికై శిక్షణ పొందుతున్న అధికారులు తమ శిక్షణలో భాగమైన క్షేత్ర స్థాయిలో కేస్ స్టడీ మరియు పరిశోధన కార్యక్రమం లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా లో ఏడు రోజులు పాటు పర్యటించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం ఉదయం కలక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తో శిక్షణ కు ఎంపికైన 10 మంది ఐ ఎ ఎస్ అధికారులు సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో డి ఆర్వో టి శ్రీరామచంద్రమూర్తి, జిల్లా నోడల్ అధికారి ఎన్ వి వి ఎస్ మూర్తి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లడుతూ , ఇండియన్ అడ్మినస్ట్రేటివ్ సర్వీస్ లో నిర్ణయాలు తీసుకోవడం లో  ఎంతో సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని తెలియ చేశారు. ఈ శిక్షణా కార్యక్రమం లో భాగంగా ఏడు రోజుల పర్యటన లో తొలిరోజు అధికారులతో సమావేశం , నగర అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక అమలు పై   ఆరోగ్యం మరియు పారిశుద్ధ్య సమస్యలకు సంబంధించి సిబ్బంది, ప్రజలతో  ముఖాముఖి సంభాషించడం ద్వారా అవగాహనా కల్పించడం జరిగింది. అనంతరం మున్సిపాలిటీ పాఠశాలను సందర్శించి పాఠశాల స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మూడో రోజు మురికివాడలను కలిగి ఉన్న వార్డులను సందర్శించడం, వార్డు స్థాయి కార్యకర్తలతో సమావేశం,   పౌరులు- పౌర కేంద్ర సేవలు, మురికివాడల అభివృద్ధి పథకాలు, పేదరికం మరియు జీవనోపాధి మొదలైన ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై అవగాహన కల్పించనున్నట్లు ప్రశాంతి తెలిపారు.  సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై  నిర్వహణ/.వ్యర్థాలను డంపింగ్ చేసే ప్రదేశాలలో పారిశుధ్య కార్మికులు, స్థానిక పౌరులతో పరిశీలనలు,  పర్యావరణ-పర్యావరణ సంబంధిత సమస్యలపై కమ్యూనిటీ ముఖాముఖి సంభాషించనున్నట్లు పేర్కొన్నారు.  సంస్థాగత కార్యకలాపాల తీరును  గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీ, పిహెచ్‌సి, పంచాయతీ కార్యాలయం మరియు ఇతర సంస్థల వంటి స్థానిక సంస్థలను సందర్శిస్తారని ప్రశాంతి తెలియ చేశారు. ఈ క్రమంలో మొత్తం వివరాలను విశ్లేషణ సామర్థ్యం కు మంచి అవకాశం అని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరిత్యాలు, చేపడుతున్న చర్యలు పై అవగాహన, ప్రజలతో, గ్రామస్తులతో సమావేశమయ్య ఏర్పాటు చెయ్యనున్నట్లు తెలిపారు.  సామాజిక-ఆర్థిక మరియు వనరుల మ్యాప్‌లను  సామాజిక మ్యాప్‌ను రూపొందించిన తర్వాత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించి విశ్లేషించి, సరిగ్గా డాక్యుమెంట్ చేయండం లో జిల్లా యంత్రాంగం అన్నీ విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టరు తెలిపారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గ్రామాభివృద్ధి ప్రణాళిక , వికాసిత్ భారత్, అభివృద్ధి , నైపుణ్యం, వ్యవస్థాపకత, పౌరులకి  కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సేవలు తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన బృందంలో పాల్గొన్న యువ ఐ ఎ ఎస్ లు   మన్నన్ సింగ్, అనురాగ్ బబెల్, ప్రియా రాణి, షాహీదా బేగమ్, పార్త్, కశీష్ భక్షి, స్నేహపన్న, జాదవ్ రావు నిరంజన్ మహేంద్ర సింగ్, తుషార్ నెగి, అతుల్ మిశ్రా లు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *