Breaking News

శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగరంలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం మంత్రివర్యులు కుటుంబ సమేతంగా నగరంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా
వేద పండితులు, నిర్వాహకులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు.

తదనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భక్త నరసింహం 1929లో స్వామి వారిని స్వయంభుగా ఆనాడు ప్రతిష్టించారన్నారు. అందరి సమక్షంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగిందన్నారు. అప్పటి నుండి నిత్యము స్వామి వారి పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ పాండురంగ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదీన గణపతి పూజతో ప్రారంభమయ్యాయని ఈనెల 15వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. పండరీపురం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయం మచిలీపట్నంలో ఉండడం గొప్ప విషయమన్నారు.
రాష్ట్రంలోని నలుమూలల నుండే కాక దేశంలోని నలుమూలల నుండి కూడా భక్తులు మచిలీపట్నం విచ్చేస్తుంటారన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మోత్సవాలు నిర్వహించదం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ఈ ప్రాశ స్తాన్ని మరింత పెంచాలని అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్థానానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నారు.

.
2014 సంవత్సరానికి ముందు దాదాపు 40 సంవత్సరాల కిందట రథోత్సవాన్ని నిలిపివేశారని తెలుసుకొని అందరి సహకారంతో 2014లో రథోత్సవాన్ని పునః ప్రారంభించుకున్నామన్నారు. అప్పటినుండి నిరంతరం రథోత్సవం కొనసాగుతోందన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ నెల 13 వ తేదీన స్వామి వారి రథోత్సవం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యము, మంచినీరు, విద్యుత్తు ఏర్పాట్లు చేశామని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించామన్నారు.

అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాదిమంది భక్తులు ఇక్కడకు వస్తారని వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ కు సూచించామన్నారు. అధికారులందరూ ఆ పనులు చేపట్టడం జరిగిందని, వారంతా ఆ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు.  ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *