-వొచ్చే సమావేశంలో సమస్యలు పరిష్కారం పై సమగ్ర నివేదిక అంద చెయ్యాలి
-ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ ఈ లు, వ్యవసాయ, పురపాలక, ఆర్డబ్ల్యూఎస్, పరిశ్రమల అధికారులు హాజరు కావాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాగు నీటి అవసరాలకి , త్రాగునీటి అవసరాలకు , పరిశ్రమలకు నీటి సరఫరా విధానం మరింత సమర్థవంతంగా నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆ దిశలో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశ నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు పి ప్రశాంతి మాట్లాడుతూ, సలహా మండలి సమావేశ నిర్వహణ విషయంలో అసలు దృక్పథం మేర కాకుండా నిర్వహించడం రోటీన్ గా చేపట్టడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమ డెల్టా ప్రాంత డి ఈ గైరాజరుపై కలక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న సమావేశానికి సమన్వయ శాఖల అధికారులతో పాటు సంబంధిత ఇరిగేషన్ అధికారులు పూర్తి నివేదిక తో హజరు కావాలని పేర్కొన్నారు. సమావేశం హాజరైన సంబంధిత ఇరిగేషన్ అధికారులు కాకుండా వారి దిగువ స్థాయి సిబ్బందిని పంపడం, వారికి నివేదికలు సమర్పించడంలో అవగాహన లేకపోవడం పై కలక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధించిన ఎస్ ఈ లు, ఈ ఈ లు , సమన్వయ శాఖల అధికారులతో తదుపరి సమావేశం నిర్వహించాలన్నారు. తూర్పు ,పశ్చిమ , సెంట్రల్ డెల్టా డేటా వివరాలు పిపిటీ ప్రదర్శన కాకుండా క్షేత్ర స్థాయిలో సమస్యలు, వాటికీ పరిష్కార మార్గాలు తో కూడిన నివేదికలు అందచేయాలని, వాటినీ అధ్యాయనం చేసి, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అంద చెయ్యడం ఈ స నాఆవేశం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. వలన “కాడా” మాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిధులను మంజూరు చేయడం నీటిపారుదల సామర్థ్యాన్ని మరియు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి పని చేసేలా సమావేశ నిర్ణయాలు, ప్రతిపాదనలు ఉండాలన్నారు. టీఆర్ 27 కింద తాత్కాలికి పనులు చెప్పడం కంటే శాశ్వత పనులను ప్రతిపాదించి పూర్తి చేయాలన్నారు. సాగునీరు సరఫరా వ్యవసాయానికి అవసరమైన సాగునీరు వివరాలు తెలుసుకోవడం కోసం మండల వ్యవసాయ అధికారులు నుంచీ వివరాలుతో వ్యవసాయ అధికారులు నివేదిక తయారు చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు నీటి సరఫరా, మునిసిపల్ , ఆర్డబ్ల్యూఎస్ అధికారులు త్రాగునీటి అవసరాలపై , పరిశ్రమలకు సంబంధించి నీటి అవసరాలు తో కూడిన నివేదికను అందించాలన్నారు. ఎర్ర కాలువ, కొవ్వాడ , చింతలపూడి , తొర్రిగడ్డ, సీతానగరం, ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆయా ప్రాజెక్ట్ పరిధిలో సీజన్ వారీగా సాగు విస్తీర్ణం, సాగు నీరు అందించడంలో సమస్యలు పై నివేదిక తయారు చేసి అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి జి శ్రీనివాసరావు, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, వ్యవసాయ అధికారి మాధవరావు, ఈ ఈ కాశీ విశ్వేశ్వరరావు, సిపివో ఎల్. అప్పలకొండ, ఇతర ఇరిగేషన్ అధికారులు డి ఈ లు, ఏ ఈ లు తదితరులు హాజరయ్యారు.