Breaking News

ఎమ్మెల్యే సుజనా చౌదరి పై అవాకులు, చవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతాం… : అడ్డూరి శ్రీరామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గానికి వేస్ట్ ఫెలో వెలంపల్లి శ్రీనివాస్ అని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఎద్దేవాచేశారు. రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా పనిచేసిన వెలంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరిన కార్పోరేటర్లతో కలిసి అడ్డూరి శ్రీరామ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ శాసనసభ్యులు సుజనా చౌదరిని విమర్శించే అర్హత , స్థాయి శ్రీనివాస్ కు లేవన్నారు. శాసన సభ్యునిగా మంత్రిగా పనిచేసిన వెలంపల్లి ప్రతి పనికి ఒక రేటు కట్టి అవినీతి చక్రవర్తిగా మారి వందలకోట్ల సంపదను దోచుకున్నాడని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలని, ప్రభుత్వ అధికారులను, వ్యాపారస్తులను సైతం బెదిరిస్తూ నియోజకవర్గానికి గ్రహణం లా పట్టుకున్న వేస్ట్ ఫెలో అన్నారు .ఎన్నికల్లో వెలంపల్లి ని ఓడిస్తారని తెలిసే పక్క నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారన్నారు .అక్కడ కూడా తన్ని తరిమేశారని తన ఉనికిని కాపాడుకోవడానికి వెలంపల్లి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పారదర్శక పాలన అందిస్తూ సుజనా ఫౌండేషన్ ద్వారా విద్య , వైద్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని అలాంటి వ్యక్తి గురించి లేనిపోని అవాకులు, చవాకులు పేలితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

వెలంపల్లి కాదు వసూళ్ళ పల్లి
మైలవరపు దుర్గరావు
వెలంపల్లి వసూళ్ళ పల్లి అని కప్పం కట్టకపోతే అభివృధ్ధి పనులను కూడా అడ్డుకుంటారని టిడిపి నాయకులు మైలవరపు దుర్గారావు ధ్వజమెత్తారు. సుజనా చౌదరి గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నారు. నీ దోపిడీలు, అరాచకాలు, దుర్మార్గాలను ఎండ కడతామన్నారు. వందల కోట్ల అవినీతి సొమ్ము ఏ విధంగా సంపాదించావో చెప్పాలన్నారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అమ్మవారి సంపాదన కూడా దోచుకున్న ఘనుడు వెలంపల్లి అన్నారు.అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసి వెలంపల్లి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో, సుజనా చౌదరి నాయకత్వంలో పశ్చిమ లోని ప్రజలు, వ్యాపారస్తులు స్వేచ్ఛగా, సజావుగా తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారని తెలియజేశారు.
లేబర్ కాలనీ ఇండోర్ స్టేడియం పూర్తి చేయలేని అసమర్ధ మాజి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అని అన్నారు. స్టేడియం నిర్మాణ పనుల్లో మేయర్ భాగ్యలక్ష్మి తో కలిసి కాంట్రాక్టర్లను బెదిరించి దోచుకోవాలని చూశారని అందువల్లే లేబర్ కాలనీ ఇండోర్ స్టేడియం పూర్తి కాలేదని చెప్పారు. ఇటీవల పశ్చిమ నియోజకవర్గంలో వరదలు సంభవించినప్పుడు వెలంపల్లి ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. సుజనా చౌదరి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధితులకు బాసటగా నిలబడ్డాడని పది రోజులు పాటు వరద బాధితులకు లక్ష మందికి పైగా నిరంతరం ఆహారాన్ని , వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారన్నారు. సుజనా చౌదరి గురించి మాట్లాడి అర్హత వెలంపల్లి కు లేదన్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వెలంపల్లి అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలను చేసాడన్నారు. సుజనా చౌదరి ప్రజా ప్రతినిధిగా అన్ని పార్టీల సహకారంతో సంక్షేమాన్ని అందించాలని వైసిపి కార్పొరేటర్ లను నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆహ్వానించారని తెలిపారు. చేతనైతే అభివృద్ధికి సహకరించాలని లేకపోతే మూసుకొని ఉండాలన్నారు. డొల్లతనం కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం మీద సుజనా చౌదరి మీద విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
టిడిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మాట్లాడుతూ తన సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటూ ఇతరులను ప్రజా ప్రతినిధులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ అభివృద్ధికి అడ్డంపడ్డ వెలంపల్లి ని నియోజకవర్గ ప్రజలు తన్ని తరిమేశారన్నారు. కులమతాలకతీతంగా సుజనా చౌదరి పరిపాలన చేస్తున్నాడని తెలిపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, మహాదేవ అప్పాజీ, అత్తులూరి పెదబాబు, మైలవరపు కృష్ణ, అర్షద్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *