-18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి క్యాన్సర్ స్ర్కినింగ్ పరీక్షలు
-ప్రతి కుటుంబంలో ఏ యే పరీక్షలు చేసే వివరాలను ముందుగానే తెలియజేయాలి
-ప్రతి టీమ్ రోజు కు 5 కుటుంబాలకు పరీక్షలు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో క్యాన్సర్ అనే మహమ్మారి నిర్ములించుటకు వైద్య అధికారులు సిబ్బంది కలసి కట్టుగా బాద్యత తో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్విమ్స్ ఆసుపత్రి ఆడిటోరియం నందు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సునీత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి లతో కలసి ఈ నెల 14 నుండి జిల్లాలో ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి వివిధ రకాల క్యాన్సర్ పరీక్షల నిర్వహణ పై డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశం లో ఏ రాష్ట్రంలో లేని విదంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినది తెలిపారు. ఈ నెల 14 నుండి జిల్లా లో ప్రతి ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి వివిధ రకాల పరీక్షల నిర్వహించుట కు అన్ని ఏర్పాట్లు చేయాలని డి యం & హెచ్ ఓ ను ఆదేశించారు. జిల్లాలో క్యాన్సర్ అనే మహమ్మారి లేకుండా నిర్మూలించుటకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది బాధ్యతతో పనిచేయాలన్నారు. ముందురోజు ఆశ వర్కర్లు వారి కేటాయించిన గ్రామాలకు వెళ్లి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి మీ ఆరోగ్యానికి సంబంధించిన వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్న సమాచారాన్ని ముందుగానే తెలియజేయాలన్నారు.
కుటుంబంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బిపి, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్ ,పక్షవాతం , బ్రెస్ట్ క్యాన్సర్ మొదలగు వాటికి వ్యాది నిర్దారణ పరీక్షలు సిహెచ్ఓ ,ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ప్రజల తో స్నేహ పూర్వకంగా, ఇష్టం తో క్వాలిటీగా స్క్రీనింగ్ పరీక్షలునిర్వహించాలన్నారు. ఏ యన్ యం లు పరీక్షలకు సంబంధించి వ్యాధులను యాప్ లో అప్ లోడు చేయాలని,మెడికల్ ఆఫీసర్లు నిర్ధారణ పరీక్షల్లో వ్యాది నిర్దారణ అయితే చికిత్స చేయాలన్నారు.ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సూపర్వైజర్ స్టాఫ్ మరియు మెడికల్ ఆఫీసర్లు,మండల స్థాయి డాక్టర్లు పర్యవేక్షణ చేయాలని తెలిపారు.
చికిత్స అనంతరం వ్యాధి గ్రస్థుల సంక్రాంగా మందులు వాడుతున్నారా లేదని పరిశీలించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే సిమ్స్ ఆధ్వర్యంలో పింక్ బస్సు ద్వారా గ్రామాలలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని,క్యాన్సర్ ఉన్న వారికి స్విమ్స్ లో వైద్య సేవలు అందయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిమ్స్ డైరెక్టర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డిఎం అండ్ హెచ్ ఓ కాన్సర్ కి సంబంధించిన వివిధ రకాల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, యం యల్ హెచ్ పి లు,ఏ యన్ యం లు,ఆశ వర్కులు తదితరులు పాల్గొన్నారు.