Breaking News

తూర్పు కాపుల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు కాపుల అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడుతోనే సాధ్య మని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ గా శ్రీకాకుళం జిల్లా జనసేన కు పాలవలస యశ్వసి ఎంపికైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ మరియు డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశ్వసి మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ గా అవకాశమిచ్చినందుకు మంత్రి సవితకు పాలవలస యశ్వసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, యశ్వసికి అభినందనలు తెలిపారు. కూటమి లక్ష్య సాధనలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడిగా జగనాసుర పాలనను సమన్వయంతో చమరగీతం పాడామని, అదే స్ఫూర్తితో మూడు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులైన వారందరికీ పథకాలు అందజేయాలని మంత్రి సవిత సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *