గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
త్రాగునీటి సరఫరా విషయంలో ఉదాశీనత సరికాదని, యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ జిఎంసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ సంజీవయ్య నగర్ రైల్వే గేటు దగ్గర పంపింగ్ లైన్ పై ఏర్పడిన లీకును పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ నుండి వస్తున్న పంపింగ్ లైన్ పై ఏర్పడిన లీకును యుద్ద ప్రాతిపదికన మరమత్తు చేపట్టాలని, పనుల్లో జాప్యం వలన నగరంలో త్రాగునీటి సరఫరాలో లోపం జరుగుతుందని తెలిపారు. త్రాగునీటి సరఫరా విషయంలో ఇంజినీరింగ్ అధికారులు ఉదాశీనంగా వ్యవహరించ కూడదని, పెండింగ్ సమస్యలు ఉంటే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలన్నారు. లీకు పనులను 3 రోజుల్లో పూర్తి చేసేలా కాంట్రాక్టర్ తో సమన్వయం చేసుకోవాలని ఈఈని ఆదేశించారు. అలాగే పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ కోసం పెండింగ్ పనులను సమీక్షించి పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పై చర్చి ప్రతినిధులు, చుట్టు పక్కల నివాసాల వారితో కమిషనర్ నేరుగా చర్చించి, ఎవరికి సమస్య లేకుంట పైప్ లైన్ పనులు చేపడతామని, పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ వలన లక్షల మంది నగర ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పర్యటనలో ఎస్.ఈ. నాగమల్లేస్వరరావు, ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ కళ్యాణ రావు, ఏఈ నాగవేణి తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి
-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని …