విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు.
కంకిపాడు మండలం గొడవర్రు గ్రామ సచివాలయాన్ని బుధవారం సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలను సచివాలయ సిబ్బంది అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు కోవిడ్ నివారణ సూచనలు, వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన పరచాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే వాల్ పోస్టర్లను, బోర్డులను ప్రజలు తిలకించేలా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో పెన్షన్లు, రేషన్ పంపిణీ తీరును సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. ప్రతి వారం సోమ,మంగళ, బుధవారంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టార్లను ఆయన పరిశీలించారు. వీరి వెంట కంకిపాడు తహాశీల్దార్ తోట సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …