గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లే అవుట్స్ ల్లో డిశంబర్ చివరి నాటికి పెండింగ్ ఇళ్లు నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ఏటుకూరు 5 లే అవుట్లలో హౌసింగ్ పిడి, ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులు, కాంట్రాక్టర్లతో ఇళ్ళ నిర్మాణ పనుల పురోగతిపై లే అవుట్ లోనే సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత లే అవుట్ లో కాంట్రాక్టర్ల వారీగా ఇళ్ళ నిర్మాణం ఏ మేరకు పూర్తి అయింది, గ్రౌండ్ లెవల్ ఎన్ని ఉన్నది, మౌలిక వసతులు, బిల్స్ చెల్లింపు, ఇసుక, సిమెంట్, ఇనుము లభ్యత తదితర అంశాలను అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెల్సుకొని, మాట్లాడుతూ డిశంబర్ నెల చివరి నాటికి లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేసేలా హౌసింగ్ లే అవుట్స్ ల్లో ఇళ్ల నిర్మాణపనులు కాంట్రాక్టర్ల వారీగా ఇచ్చిన టైం లైన్ మేరకు చేపట్టాలని, నిర్మాణ పనుల కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు అవసరమైన కార్మికులను సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి లే అవుట్ నుండి కాంట్రాక్టర్ ప్రతి రోజు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయాలని, నోడల్ అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలన్నారు. లే అవుట్ ల వారిగా ఎప్పటికప్పుడు పనుల పురోగతి పై నివేదిక ఇవ్వాలని, ఏ సమస్య ఎదురైనా అధికారులు సమన్వయంతో పరిష్కరించి పనుల వేగవంతంకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేజిల వారీగా నిర్మాణ పనులు పూర్తి అయిన వాటికి సంబందించి బిల్లుల ఆన్ లైన్ ఎమినిటి కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు చేయాలని, జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. లబ్దిదారుల జియోట్యాగ్ ని సచివాలయాల వారీగా లిస్టు తీసుకొని నోడల్ అధికారులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏటుకూరు 5 లే అవుట్స్ ల్లో 9700 మంది లబ్దిదారులు ఉంటే వారిలో షుమారు 4200 ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిలో ఎక్కువ శాతం డిశంబర్ చివరి నాటికి పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామన్నారు. పనులు వేగవంతం కావడానికి అవసరమైన ఇసుక, గ్రావెల్, మెటల్ కోసం మైనింగ్ డిపార్ట్మెంట్ 2 రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అప్రోచ్ రోడ్ల ఏర్పాటు జిఎంసి భాధ్యత అని, ఇప్పటికే లే అవుట్ లో నివాసం ఉంటున్న 30 కుటుంబాలకు ప్రతి రోజు ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, హౌసింగ్ పిడి ప్రసాద్, ఈఈ శంకరరావు, నగరపాలక సంస్థ ఈఈ కోటేశ్వరరావు, నగరపాలక సంస్థ డిఈఈలు కళ్యాణ రావు, శ్రీనివాస్, హౌసింగ్ డిఈఈలు ప్రసాద్, సత్యనారాయణ, ఏఈలు, నోడల్ అధికారులు, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …