గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంఎల్సీ ఓటర్ క్లెయిమ్స్ ని బియల్ఓలు పారదర్శకంగా పరిశీలించాలని, క్లెయిమ్స్ ని గురువారం సాయంత్రానికి పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎంఎల్సీ ఓటర్ క్లెయిమ్స్ ని బిఎల్ఓలు నేరుగా అర్జీదారు ఇంటికి వెళ్లి ప్రత్యేక్షంగా పరిశీలించాలని, గురువారం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. దరఖాస్తులను సచివాలయంలో ఉండి రిమార్క్స్ నమోదు చేయకూడదన్నారు. సర్టిఫికెట్ పెండింగ్ ఉంటే శుక్రవారం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. అలాగే ఓటర్ అర్జీలో గెజిటెడ్ సంతకాలు పరిశీలించాలని, ఎక్కువ మంది దరఖాస్తుల్లో ఒకే సంతకాలు ఉంటే సదరు అధికారిని సంప్రదించాలన్నారు. సంతకాలు ఫోర్జరీ అని గుర్తిస్తే వెంటనే సదరు దరఖాస్తుని తిరస్కరించాలన్నారు. దరఖాస్తుల ఆమోదంలో నిర్లక్ష్యంగా ఉంటే బిఎల్ఓ, సూపర్వైజర్ అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డోర్ నంబర్ల అంశంలో పట్టణ ప్రణాళిక విభాగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. బిఎల్ఓ సూపర్వైజరి అధికారులు ప్రతి బిఎల్ఓ పరిధిలో 20 శాతం క్లెయిమ్స్ ని నేరుగా పరిశీలించి, రిమార్క్స్ నమోదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ రాంబాబు, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మనాభరావు, సూపర్వైజర్ అధికారులు, బిఎల్ఓలు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …