Breaking News

ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అభివృద్ధికి కావలసిన నిధులకు అనుమతులు మంజూరు

-ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల యొక్క అభివృద్ధి లో భాగంగా నేడు ప్రవేశ పెట్టిన పలు అజెండా అంశాలపై హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించిన చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అభివృద్ధి లో భాగంగా నేడు ప్రవేశ పెట్టిన పలు అజెండా అంశాలపై హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించి పలు అంశాలను ఆమోదించి నిధులను మంజూరు చేసి వైద్య అధికారులకు తగిన సూచనలు,సలహాలు ఇచ్చిన హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్.

నేటి బుధవారం సాయంత్రం స్థానిక ఎస్.వి మెటర్నిటీ హాస్పిటల్ నందు ప్రసూతి వైద్యశాల అభివృద్దికి అవసరమైన పలు అంశాలను గురించి తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య ,ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థసారథి, రుయా సూపరింటెండెంట్ రవి ప్రభు, డి ఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీహరి, వైద్యాధికారులతో కలసి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆస్పత్రికి అవసరమైన పలు అభివృద్ధి అంశాల గురించి కలెక్టర్ వివరణ కోరగా ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ జి. పార్థ సారథి మాట్లాడుతూ … ఘన చరిత్ర కలిగిన మెటర్నిటీ ఆసుపత్రికి వేల సంఖ్యలో గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారని, ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది అంతా కూడా వైద్య సదుపాయం అందిస్తున్నారని, కొన్ని మరమ్మతులకు గురైన వైద్య పరికరాలు ఉన్నాయని, వాటిని బాగుచేయాలని ఇంకా మెరుగైన వైద్యం అందించేలా అధునాతన పరికరాలు అవసరం ఉందని, అత్యవసరమైన అజెండా అంశాలను కలెక్టర్ గారి ముందు ఉంచగా…
కలెక్టర్ మరియు చైర్మన్ వారు సానుకూలంగా స్పందిస్తూ అజెండలోని కొన్ని అంశాలను ఆమోదించి అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయగా , మరి కొన్ని పరిశీలిస్తామని తెలిపారు. చికిత్స మధ్యలో విద్యుత్ ఆటంకం కలగకుండా జనరేటర్ ఏర్పాటు చేయాలని, చికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలను, ఆసుపత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగమైన పలు మౌలిక వసతులు, సి సి రోడ్లను పరిశీలన చేస్తామని అన్నారు. తదుపరి సమావేశంలో మరిన్ని పరిశీలించి ఆమోదిస్థామని తెలిపారు.
ప్రసూతి ఆసుపత్రి పి.జి.విద్యార్థులను ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.పి.ఏ.చంద్రశేఖర్, డి.సి.ఎస్ . ఓ డా.ఆనంద్, ఓ.బి.జి హెచ్. ఓ.డి డా. ప్రమీలా దేవి, ఆర్.ఎం. ఓ డా.ఆర్.ఆర్.రెడ్డి, ఓ.బి.జి ప్రొఫెసర్లు, డాక్టర్లు మరియు ఏ.పి.ఎం.ఐ.డి.సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ, మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతం

–3వ డివిజన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *