తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాంతీయ సహకార కేంద్ర బ్యాంకు నందు 71 వ అఖిల భారత సహకార వారోత్సాలను జిల్లా సహకార అధికారిణి లక్ష్మి ప్రారంభించారు. ఈమె ప్రారంభోపన్యాసం చేస్తూ వికసిత భారత దేశంలో సహకార రంగం పాత్ర అనే అంశంపై ప్రసంగించారు.నవంబర్ 14 నుండి 20 వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయని ఫేర్కొ న్నారు.1953 సంవత్సరం నుoడి సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు. ఈకార్య్రమంలో పాల్గొన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ మద్దిపట్ల వెంకట్రమణ మాట్లాతూ సహకార రంగ అభివృద్ధికి భారత మరియు ఆంధ్రదేశ్ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఊరూరికి ఒక బహుళార్థ సహకార సంఘం ఏర్పాటు చేసి అన్ని సేవలు అందించటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నా రు. తద్వారా ఊరూర అభివృద్ది భారత దేశ ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది అని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉమాపతి, నాగభూషణం, రవీంద్రనాథ్ పెంచలయ్య,బ్యాంకు మేనేజర్స్ శ్రీదేవి, సురేష్,బ్యాంకు సిబ్బంది, సహకార సిబ్బంది పాల్గోన్నారు.
Tags tirupathi
Check Also
హజ్ యాత్ర -2025 ఏర్పాట్లపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్ర-2025కు వెళ్లే యాత్రికులకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర న్యాయ …