Breaking News

ఘనంగా జాతీయ బాలల దినోత్సవం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త
బాలల దినోత్సవం పురస్కరించుకొని  గురువారం మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం మరియు అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల్ని ఘనంగా జరుపుకోవడం జరిగినది మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిని జయలక్ష్మి మాట్లాడుతూ నేటి బాలలే నేటి పౌరులు అనే నినాదంతో ప్రతి విద్యార్థి సామాజిక విషయాల పట్ల అవగాహణ పెంచుకుని స్వీయ రక్షణ పద్ధతులు పాటించాలని,, ఏదైనా సమస్యలు ఎదురైనపుడు కుటుంబం, పాఠశాల సిబ్బంది, స్వచ్చంధ సంస్థల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.బాల్య వివాహం, బాల కార్మికులు వ్యవస్థ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రేణిగుంట ఐసిడిఎస్ సిడిపిఓ అయిన కృష్ణమంజరి మాట్లాడుతూ పిల్లలు మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాలని అవసరం మేరకే మొబైల్ ఉపయోగించాలని తెలియపరిచారు ప్రతి బాలిక బాగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిగమించాలని కోరారు.

జిల్లా బాలల సంరక్షణ అధికారి అయిన వి.శివశంకర్ గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థినులు ఆపద సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ పైన అవగాహన కలిగి ఉండాలని ఎవరైనా పిల్లలు ఒంటరిగా కనిపిస్తే 10 9 8 కు ఫోన్ చేస్తే సంబంధిత శాఖలు బాధ్యత వహించి పిల్లలను బాలల సంక్షేమ శాఖ నందు హాజరు పరిచి వారి రక్షణ మరియు సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలియపరిచారు ప్రగతి సంస్థ వ్యవస్థాపకులు అయిన రమణమాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా శ్రీకాళహస్తి చుట్టుపక్కల బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని సంబధిత శాఖలు చర్యలు తీసుకోవాలని తెలిపారు .బాలాజీ బాలవికాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు ఉన్నటువంటి ప్రధాన హక్కులను వివరిస్తూ ఆ హక్కులకు ఒకవేళ భంగం వాటిల్లితే ఎవర్ని సంప్రదించాలి ,ఎవరి ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అనే విషయాలపైన అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధనీ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు , రాస్ సిబ్బంది, ప్రగతి సిబ్బంది ,పిల్లలు మరియు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *