Breaking News

అవగాహన ద్వారానే క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు

-వరదయ్యపాలెం మత్తెరిమిట్ట గ్రామం క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

వరదయ్యపాలెం, నేటి పత్రిక ప్రజావార్త :
క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్పీలు క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే నిర్వహించి అనుమానత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి సరైన చికిత్స మరియు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

గురువారం స్థానిక వరదయ్యపాలెం మత్తెరిమిట్ట గ్రామం నందు ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే కార్యక్రమంలో డిఎంహెచ్ఓ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే జరుగుతోందని, ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా రొమ్ము, నోటి, సర్వైకల్ క్యాన్సర్ లను ముందుగా స్క్రీనింగ్ చేసి అరికట్టవచ్చని తెలిపారు.
కావున ప్రతి ఒక్కరు క్యాన్సర్ వ్యాధి మరియు నివారణ మార్గాల పై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది అందరూ ఈ రోజు నుంచి ఇంటింటికి వెళ్లి పై తెలిపిన మూడు రకాల క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ తో పాటు బి.పి మరియు డయాబెటిక్ పేషంట్లను కూడా స్క్రీనింగ్ చేయాడం జరుగుతుంది అని చెప్పారు.18 సంవత్సరాలు పై బడిన ప్రతి మగ మరియు ఆడవారికి ఓరల్ క్యాన్సర్ , 18 పైబడిన ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ , 30 పైబడిన ఆడవారికి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు కల వారిని ముందుగానే గుర్తించి వాళ్ళని మెడికల్ ఆఫీసర్ దగ్గరికి అలాగే ఎఫ్ డి పీ కి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర చూపించి తగు పరీక్షలు, ఇంకా ఏవైనా అవసరమైనటువంటి పరీక్షలు చేయించి అలాగే స్క్రీనింగ్ ఫర్ హెచ్ఐవి, హెచ్బీఎస్ ఏజీ, వీటిని కూడా పరీక్ష చేయించి వాళ్లకు వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ఉంటే రుయాలోని క్యాన్సర్ హాస్పిటల్ కు పంపాలని, బీపీ షుగర్ అలాగే ఇంకా ఇతర జబ్బులు ఏవైనా గుర్తిస్తే వాళ్ళని ఇంత దూరం రావాల్సిన పనిలేదు అని, సిహెచ్ ఏరియా హాస్పిటల్ దగ్గరలో హాస్పిటల్ కి పంపించి చికిత్స వెంటనే అందేలా చూస్తారనీ తెలిపారు. క్యాన్సర్ వ్యాధి బయటకు కనిపించని ఒకేసారి బరువు తగ్గడం ఇన్ఫెక్షన్ కు గురి కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు జరగడంలేదని మన రాష్ట్రంలోని క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, MLHP ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి నివారణ దిశగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ గారు స్వయంగా గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే చేస్తూ వారి వివరములను సంబంధంతో యాప్ లో నమోదు చేసే నివారణ దిశగా వారికి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం లో సూళ్లూరుపేట ఆర్ డి ఓ కిరణ్మయి , జిల్లా వైద్య శాఖాధికారి డి.ఎం.హెచ్. ఓ డా.శ్రీహరి గారు, అదనపు జిల్లా వైద్య శాఖదికారి డా. శ్రీనివాస్ రెడ్డి, NCD వైద్యురాలు DR పద్మావతి గారు, గ్రామ సర్పంచ్ హరి గారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ లు మాస్ మీడియా అధికారి బాబు నెహ్రూరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

గంజాయిని కూకటివేళ్లతో పెకిలిస్తాం : హోంమంత్రి అనిత

-చంద్రగిరి యువగళం యాత్రలో గంజాయి ప్రభావం ప్రత్యక్షంగా చూశా -గంజాయి,బ్లేడ్ బ్యాచ్ లపై పీడీ యాక్ట్ కేసులు, ఆస్తులు జప్తు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *