-ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై సూచనలు చేసిన మంత్రి నారాయణ
-ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని సూచనలు చేసిన మంత్రి
-ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడి.
-కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేసిన మంత్రి నారాయణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యాసంస్థలు నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని అన్నారు…ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు మంత్రి నారాయణ ఈ నిర్ణయం తీసుకున్నారు.విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలోని ఆడిటోరియంలో ఇంటర్ బోర్డు నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు రీజినల్ జాయింట్ డైరెక్టర్లు,ఆర్ ఐవోలు,జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు,ఐదు రీజినల్ సెంటర్లలోని కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలా చదివించాలి…ర్యాంకుల సాధనకు ప్రణాళికలు ఎలా ఉండాలి..పోటీ పరీక్షలను తట్టుకునేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందించాలనే అంశాలపై మంత్రి నారాయణ అధ్యాపకులకు సూచనలు చేశారు.గతేడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్ధులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ…మార్కులు తగ్గడానికి గల కారణాలేంటని ఆరా తీసారు..పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని…దానికి తగ్గట్లుగానే విద్యార్ధులకు అవసరమైన విధంగా విద్యాబోధన చేయాలని సూచించారు.విద్యార్దులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు.
ఈ ఏడాది ఈఏపీసెట్ రాసే విద్యార్ధులకు నారాయణ విద్యాసంస్థల నుంచి కోచింగ్ మెటీరియల్ అందిస్తానని చెప్పారు…స్వతహాగా లెక్కల అధ్యాపకుడు అయిన మంత్రి నారాయణ…విద్యార్ధులకు లెక్కలు ఎలా బోధించాలనే దానిపై వర్క్ షాప్ కు హాజరైన అధ్యాపకులకు ఉదాహరణలతో వివరించారు.